ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి..

06.11.2024,బుధవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి రా9.18 వరకు

వారం:సౌమ్యవాసరే (బుధవారం)

నక్షత్రం:మూల ఉ9.09 వరకు

యోగం:సుకర్మ ఉ10.00 వరకు

కరణం:బవ ఉ9.09 వరకు

తదుపరి బాలువ రా9.18 వరకు

వర్జ్యం:ఉ7.30 - 9.09

మరల సా6.52 - 8.30

దుర్ముహూర్తము:ఉ11.21 - 12.06

అమృతకాలం:తె4.36నుండి

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి:ధనుస్సు

సూర్యోదయం:6.04

సూర్యాస్తమయం:5.24

మేషం(Mesham)

ఈ రాశి వారు ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.

వృషభం(Vrushbam)

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నంసులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభం.

మిథునం(Mithunam)

ఈ రాశి వారికి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షణ చేయండి.

సింహం(Simham)

ఈ రాశివారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. అమ్మవారిని ఆరాధించండి.

కన్య(Kanya)

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. సుబ్రహ్మ్యేశ్వరస్వామి స్తోత్రం చదవండి.

తుల(Thula)

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇష్టదైవాన్ని భక్తిగా ప్రార్ధించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశి వారు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మహాలక్ష్మి ఆరాధన చేయండి.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశి వారికి అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. భగవంతుడి నామాన్ని జపించండి.

మకరం(Makaram)

ఈ రాశి వారికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. శివాలయ సందర్శన శుభం.

కుంభం(Kumbam)

ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణము మంచిది.

మీనం(Meenam)

ఈ రాశి వారు తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. అమ్మవారి ఆరాధన చేయండి.

Eha Tv

Eha Tv

Next Story