ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలల అనుకూలం

06.10.2024,ఆదివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి పూర్తి

వారం;భానువాసరే

(ఆదివారం)

నక్షత్రం:విశాఖ రా9.58 వరకు

యోగం:ప్రీతి తె5.33 వరకు

కరణం:వణిజ సా5.16 వరకు

వర్జ్యం:రా2.14 - 3.56

దుర్ముహూర్తము:సా4.09 - 4.56

అమృతకాలం:మ12.24 - 2.08

రాహుకాలం;సా4.30 - 6.00

సూర్యరాశి:కన్య

చంద్రరాశి:తుల

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం:5.45

మేషం

ఈ రాశివారు శుభవార్తలు వింటారు. మీ బుద్దిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.

వృషభం

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం.

మిథునం

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. ముఖ్య విషయాలలో పెద్దల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. సూర్యస్తోత్రం చదివితే మంచిది.

కర్కాటకం

ఈ రాశివారికి కొన్ని కీలక అంశాలలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శనిధ్యాన శ్లోకం చదువుకోవాలి.

సింహం

ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కన్య

ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

తుల

ఈ రాశివారికి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం

ఈ రాశివారు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈ రాశివారికి కీలక బాధ్యతలు భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. శని శ్లోకం చదవండి.

మకరం

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కుంభం

ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మీనం

ఈ రాశివారికి వారి మంచితనమే వారి ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీనారాయణ సందర్శనం శుభప్రదం.

Updated On 6 Oct 2024 5:00 AM GMT
Eha Tv

Eha Tv

Next Story