: ఈ రాశి వారికి తిరుగులేదు!

తేదీ:- 06,నవంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:-దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- కార్తీక మాసం

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- పంచమి రా.9.13 వరకు

వారం:- బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:- మూల ఉ.8.54 వరకు

యోగం:- సుకర్మ ఉ.10.00 వరకు

కరణం:- బవ ఉ.9.09 వరకు తదుపరి బాలువ రా9.18 వరకు

వర్జ్యం:- ఉ.7.30 - 9.09

మరల సా.6.52 - 8.30

దుర్ముహూర్తము:- ఉ.11.21 - 12.06 వరకు

అమృతకాలం:- తె.4.36నుండి

రాహుకాలం:- మ.12.00 - 1.30 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు

సూర్యరాశి:- తుల

చంద్రరాశి:- ధనుస్సు

సూర్యోదయం:- 6.04 సూర్యాస్తమయం:- 5.24

మేషం(Mesham)

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి.

వృష‌భం(Vrushabam)

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. శివారాధన శ్రేయస్కరం.

మిథునం(Mithunam)

ఈ రాశి వారికి అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్తపనులు ప్రారంభించకూడదు. దుర్గాదేవి అష్టోత్తరం చదవండి.

క‌ర్కాట‌కం(Karkatakam)

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శ్రీ వేంకటేశ్వర ఆలయ సందర్శన మంచిది.

సింహం(simham)

ఈ రాశి వారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్తపనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

క‌న్య‌(Kanya)

ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల వల్ల లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. అమ్మవారి ఆరాధన మంచిది.

తుల‌(Thula)

ఈ రాశి వారి కి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మహాలక్ష్మి పూజ చేయండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.

ధ‌నుస్సు(dhanusu)

ఈ రాశి వారికి ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. శివాలయ సందర్శన శుభం.

మ‌క‌రం(Makaram)

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళణ చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మవారిని ఆరాధించండి.

కుంభం(Kumbham)

ఈ రాశి వారికి చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. దైవారాధన మంచిది.

మీనం(Meenam)

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంఆయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణము మంచిది

Eha Tv

Eha Tv

Next Story