ఈ రాశివారికి అనుకూలమైన సమయం !

04.10.2024శుక్రవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ రా2.47 వరకు

వారం:భృగువాసరే

(శుక్రవారం)

నక్షత్రం:చిత్ర సా5.31 వరకు

యోగం:వైధృతి తె5.13 వరకు

కరణం:బాలువ మ1.45 వరకు తదుపరి కౌలువ రా2.47 వరకు

వర్జ్యం:రా11.40 - 1.25

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.03

మరల మ12.13 - 1.01

అమృతకాలం:ఉ10.26 - 12.12

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:కన్య

చంద్రరాశి:తుల

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం:5.46

మేషం

ఈ రాశివారు తమ తమ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

వృషభం

ఈ రాశివారు తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం

ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

సింహం

ఈ రాశివారికి ఇది అనుకూల సమయం. తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

కన్య

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

తుల

ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

ధనుస్సు

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.

మకరం

ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కుంభం

ఈ రాశివారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది.ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

మీనం

ఈ రాశివారికి కర్మసిద్ధి ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

Eha Tv

Eha Tv

Next Story