ఈ రాశి వారికి తిరుగులేదు!
04.11.2024,సోమవారం,
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
కార్తీక మాసం - శుక్ల పక్షం
తిథి:తదియ రా8.54 వరకు
వారం:ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం:అనూరాధ ఉ7.04 వరకు
యోగం:శోభన ఉ11.38 వరకు
కరణం:తైతుల ఉ8.26 వరకు
తదుపరి గరజి రా8.54 వరకు
వర్జ్యం:మ12.58 - 2.39
దుర్ముహూర్తము:మ12.07 - 12.53
మరల మ2.24 - 3.09
అమృతకాలం:రా11.04 - 12.46
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.02 సూర్యాస్తమయం:5.26
మేషం
ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైరసాహసాలతో ముందుకు వెళ్తారు. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.
వృషభం
ఈ రాశి వారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మంచిది.
మిథునం
ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఉంటే కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం
ఈ రాశి వారికి ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. మహాలక్ష్మి ఆరాధన చేయండి.
సింహం
ఈ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నవగ్రహ స్తోత్రం పఠించండి.
కన్య
ఈ రాశి వారికి స్త్రీలమూలకంగా ధనలాభం ఉంటుంది. ఊహించనికార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అమ్మవారిని ఆరాధించండి.
తుల
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. కులదైవాన్ని పూజించండి. మేలు జరుగుతుంది.
వృశ్చికం
ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. శివాలయ సందర్శన శుభం.
ధనుస్సు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
మకరం
ఈ రాశి వారు నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. హనుమాన్ చాలీసా పారాయణము మంచిది
కుంభం
ఈ రాశి వారు నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ సీతా రాములను పూజించండి.
మీనం
ఈ రాశి వారికి కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. దుర్గామాతను కొలవండి.