Today Rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారికి ఇది శుభకాలం
ఈ రాశివారికి భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది.
తేదీ: 3, అక్టోబర్ 2024 గురువారం,
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా12.47 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:హస్త మ2.57 వరకు
యోగం:ఐంద్రం తె4.44 వరకు
కరణం:కింస్తుఘ్నం ఉ11.46 వరకు
తదుపరి బవ రా12.47 వరకు
వర్జ్యం:రా11.48 - 1.34
దుర్ముహూర్తము:ఉ9.51 - 10.39
మరల మ2.36 - 3.24
అమృతకాలం:ఉ8.18 - 10.04
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:కన్య ||చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.54 || సూర్యాస్తమయం:5.47
మేషం
ఈ రాశివారికి భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.శివ నామస్మరణ ఉత్తమం..
వృషభం
ఈ రాశివారికి ఇది శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
మిథునం
ఈ రాశివారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
కర్కాటకం
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
సింహం
ఈ రాశివారు మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య
ఈ రాశివారికి కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
తుల
ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి, తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
వృశ్చికం
ఈ రాశివారికి బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
ధనుస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
మకరం
ఈ రాశివారు వారి అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
కుంభం
ఈ రాశివారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
ఈ రాశివారికి వారి వారి రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.