కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి

02.10.2024,బుధవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:అమావాస్య రా10.44 వరకు

వారం:సౌమ్యవాసరే

(బుధవారం)

నక్షత్రo:ఉత్తర మ12.22 వరకు

యోగం:బ్రహ్మం తె4.09 వరకు

కరణం:చతుష్పాత్ ఉ9.47 వరకు

తదుపరి నాగవం రా10.44 వరకు

వర్జ్యం:రా9.40 - 11.26

దుర్ముహూర్తము:ఉ11.27 - 12.14

అమృతకాలం:ఉ6.12వరకు

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:కన్య

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం:5.48

మేషం(Mesham)

ఈ రాశివారికి ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయసహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం(Vrushbham)

ఈ రాశివారు లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.శివారాధన శుభప్రదం.

మిథునం(Mithunam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం మంచిది.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం(Simha)

ఈ రాశివారికి సంతృప్తికరమైన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం శ్రేయస్కరం.

కన్య(Kanya)

ఈ రాశివారు పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

తుల(Thula)

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్య స్తుతి మేలుచేస్తుంది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి.దుర్గాస్తుతి చదవడం మంచిది.

మకరం(Makaram)

ఈ రాశివారు ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

కుంభం(Kumbham)

ఈ రాశివారు ఆయా రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీలక్ష్మీధ్యానం శుభకరం.

మీనం(Meena)

ఈ రాశివారు పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story