ఈ రాశి వారు అన్నింటా విజయం సాధిస్తారు

02.11.2024,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:పాడ్యమి రా08.19 వరకు

వారం:స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:విశాఖ తె5.12 వరకు

యోగం:ఆయుష్మాన్ ఉ11.46 వరకు

కరణం:బవ సా6.31 వరకు

వర్జ్యం:ఉ9.09 - 10.53

దుర్ముహూర్తము:ఉ6.01 - 7.33

అమృతకాలం:రా7.37 - 9.21

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి:తుల

సూర్యోదయం:6.02

సూర్యాస్తమయం:5.26

మేషం

ఈ రాశి వారు అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. అంతటా సుఖాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు. శివారాధన శ్రేయస్కరం.

వృషభం

ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

మిథునం

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. లక్ష్మీదేవి ఆరాధన మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. నవగ్రహ స్తోత్రం పఠించండి.

సింహం

ఈ రాశి వారికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. శ్రీ వేంకటేశ్వర ఆలయ సందర్శన శుభం.

కన్య

ఈ రాశి వారికి సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. దుర్గా దేవి పూజ చేయండి.

తుల

ఈ రాశి వారికి ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చికం

ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్థానచలన సూచనలు ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆలయ సందర్శన మంచిది.

ధనుస్సు

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అమ్మవారి ఆరాధన చేయండి.

మకరం

ఈ రాశి వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. శివాలయ దర్శనం చేసుకోండి.

కుంభం

ఈ రాశి వారికి ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి.

మీనం

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. దుర్గా అష్టోత్తరం చదవండి.

Updated On 3 Nov 2024 4:22 AM GMT
Eha Tv

Eha Tv

Next Story