Rasi Phalalu : నేటి రాశి ఫలాలు.. ఎవరికి ఏం జరగబోతుంది..!
ఎవరికి ఏం జరగబోతుంది..!
తేదీ:- 1, నవంబర్ 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయణం
ఋతువు:- శరదృతువు
మాసం:- ఆశ్వయుజ
పక్షం:- బహళ పక్షం
తిథి:- అమావాస్య సా.4.24 వరకు
వారం:- శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:- స్వాతి తె.3.03 వరకు
యోగం:- ప్రీతి ఉ.11.25 వరకు
కరణం:- నాగవ సా.4.45 వరకు తదుపరి కింస్తుఘ్నం తె.5.38 వరకు
వర్జ్యం:- ఉ.6.47 - 8.33 వరకు
దుర్ముహూర్తము:- ఉ.8.18 - 9.04 మరల మ.12.07 - 12.52 వరకు
అమృతకాలం:- సా.5.21 - 7.07 వరకు
రాహుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు
యమగండ/కేతుకాలం:- మ.3.00 - 4.30
సూర్యరాశి:- తుల
చంద్రరాశి:- తుల
సూర్యోదయం:- 6.02 సూర్యాస్తమయం:- 5.27
శ్రీ క్రోధి నామ సంవత్సరం, తిథి: బ.చతుర్దశి ప.2.47 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: చిత్త రా.12.41 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.6.58 నుండి 8.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుంచి 10.39 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.15 వరకు, అమృతఘడియలు: సా.5.31 నుంచి 7.16 వరకు, నరకచతుర్దశి, దీపావళి.
మేష రాశి: స్నేహితులు మీకు అండగా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు. మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు మీ విలువైన వస్తువును దొంగిలించే అవకాశం ఉంది. మీవస్తువులపట్ల జాగ్రత్తగా ఉండాలి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. విలువైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకూడదు. మీ భాగస్వామితో ప్రేమగా మలుచుకుంటారు.
వృషభ రాశి: మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఈరోజు మీ ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలుస్తుంది
మిథునరాశి: మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చేయాలి. గతంలో డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తే ఇప్పుడు పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైనా మీ చేతికి అందదు. పిల్లలతో సమయాన్ని గడపండి.
కర్కాటక రాశి: చిరకాల స్నేహితునితో రీ యూనియన్, మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి, మీరు ఆర్థికప్రయోజనాలను పొందుతారు. ఈరోజు చాలా బాగుంటుంది. మీకొరకు మీరు బయటకు వెళ్లి సంతోషంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి.
సింహరాశి: మీకు కావాల్సినంత శక్తి ఉంది, కానీ పని ఒత్తిడి చిరాకు పడేలాగ చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రత్యేకించి ఆర్థిక వ్యహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూసే అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి.
కన్యారాశి: మీ సానుకూలతావాదంతో ఇతరులను మెప్పించగలరు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు. మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. మీ సోదరి పెళ్ళిసంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు చూస్తారు.
తులా రాశి: ఈరోజు మీ దయా గుణం ఎన్నో సంతోషకర సమయాన్ని ఇస్తుంది. వ్యాపారస్థులకు కొంత ధననష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీర్చడమే ఈరోజు మీ ప్రాధాన్యత. అనుకున్న సమయములో పనినిపూర్తిచేయడం మంచి విషయం,
వృశ్చిక రాశి: మీ నిక్కచ్చితనంతో మీ స్నేహితుడు అప్‌సెట్ కావొచ్చు . మీకు ఈరోజు ధననష్టం సంభవించే అవకాశం ఉంది. లావాదేవీలు జరిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు పని చేసే చోట బాగా అలసిపోతారు, కుటుంబ సభ్యుల అవసరాలు, కావలసినవి ఉన్నాకూడా, నిర్లక్ష్యం చేస్తారు. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి: అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలవరపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు అండగా ఉంటారు. ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారి కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది .
మకర రాశి: సంకల్ప బలం లేకపోవడం వలన భావోద్వేగానికి గురిఅవుతారు. ఆర్థిక సమస్యలు స్నేహితుల సహాయం అందడంతో ముగించే అవకాశం ఉంది. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు, కానీ వారు మీ నుంచి కొంత సహాయం ఆశిస్తారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ఫలవంతం కావొచ్చు.
కుంభ రాశి: ఈరోజు గతంలో తీసుకున్న మీ నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మానసికంగా ఇబ్బందులు పడతారు. ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోతారు. దగ్గరి బంధువుల సహాయతో వ్యాపారము బాగా చేస్తారు. ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్ లో పని త్వరితగతిన చేస్తారు.
మీన రాశి: కాస్త అనారోగ్యంగా ఉంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ లక్ష్యాలవైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లండి. మీ లక్ష్యాల గురించి ఎవరికీ చెప్పకండి. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.