సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము:- భాద్రపదం మాసం

పక్షం : శుక్ల పక్షం

తిథి : తదియ

ఈరోజు ఉదయం 11 గం 35 ని వరకు

వారము :- శుక్రవారం

నక్షత్రం : హస్త

( ఈరోజు ఉదయం 7 గం 37 ని వరకు

వర్జ్యం : ( సాయంత్రం 4 గం 28 ని నుండి 6 గం 14 ని వరకు

అమ్రుతఘడియలు :- తెల్లవారుజామున 3 గం 22 ని నుండి 5 గం 08 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 08 గం॥ 24ని॥ నుంచి 09 గం॥ 12ని॥ వరకు)పునః ప.12-24ని నుండి 1-12ని వరకు

రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి 12గం॥ 00 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 49 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 09 ని॥ లకు

మేషం(Mesham)

ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు.ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువుని ఆరాధించాలి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు . ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

సింహం(Simham)

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కన్య(Kanya)

ఈ రాశివారు అప్రమత్తతతో ఉండటం అవసరం. బంధు,మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకున్నాతీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.

తుల(Thula)

ఈ రాశివారికి ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులు మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు మనోబలంతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు(dhanusu)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. దైవబలంతో కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి.చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.

మకరం(Makaram)

ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు.బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మీనం(Meenam)

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధకలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

Eha Tv

Eha Tv

Next Story