ఈ రాశివారికి ఇది శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

తేది :19 సెప్టెంబర్ 2024

సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము:- భాద్రపద మాసం

పక్షం : కృష్ణ పక్షము

తిథి :- పాడ్యమి

(ఈరోజు ఉదయం

6 గం॥ 17 ని॥ వరకు)

తదుపరి విదియ రాత్రి తెల్లవారుజామున 3గం 48ని వరకు

వారము;- గురువారం

⭐నక్షత్రం : ఉత్తరాభాద్ర

(ఈరోజు ఉదయం 11గం 09ని వరకు )

వర్జ్యం : (ఈరోజు రాత్రి) 10గం 18ని నుండి 11గం 47ని వరకు

అమ్రుతఘడియలు;- ఈరోజు పగలు 6 గం 52 ని నుండి 8 గం 21 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10గం॥ 00 ని॥ నుంచి 10 గం॥ 48 ని॥ వరకు)పునః ప.2-48ని నుండి 3-36ని వరకు

రాహుకాలం : (ఈరోజు పగలు 1 గం॥ 30 ని॥ నుంచి 3 గం॥ 00 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు.

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 03 ని॥ వరకు.

మేషం (Meesham)

ఈ రాశివారు కీలక వ్యవహారాలలో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృషభం (Vrushabam)

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాపూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

మిథునం (Mithunam)

ఈ రాశివారికి ఇది శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మహాలక్ష్మిని పూజించండి.

కర్కాటకం (Karkatakam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

సింహం (Simham)

ఈ రాశివారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేసుకోకండి. శివాలయాన్ని సందర్శించండి.

కన్య (Kanya)

ఈ రాశివారు అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

తుల (Thula)

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

వృశ్చికం (Vruchikam)

ఈ రాశివారు ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు (Dhanushu)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీసూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

మకరం (Makaram)

ఈ రాశివారికి సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

కుంభం (Kumbam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనఃసంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మీనం (Meenam)

ఈ రాశివారు పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. రామాలయ సందర్శన శుభప్రదం.

ehatv

ehatv

Next Story