ఈ రాశివారికి మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది

తేది 18 సెప్టెంబరు -2024

సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : భాద్రపద మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : బుధవారం

పక్షం : శుక్ల పక్షము

తిథి : పూర్ణిమ

(ఈరోజు ఉదయం 8 గం 42 ని వరకు

⭐నక్షత్రం : పూర్వాభాద్ర

ఈరోజు పగలు 12 గం 48 ని వరకు

వర్జ్యం :- రాత్రి 9గం 44ని నుండి 11గం 13ని వరకు

అమ్రుతఘడియలు:- ఈరోజు ఉదయం 7 గం 00 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి 12 గం॥ 24 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు పగలు 12 గం॥ 00 ని॥ నుంచి 1 గం॥ 30 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు

🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6గం॥ 03 ని॥ లకు.

మేషం(Mesham)

ఈ రాశివారికి మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శ్రేయస్కరం.

వృషభం(vrushabham)

ఈ రాశివారు ప్రారంభించిన కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. దుర్గాదేవిని పూజించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. శివారాధన మంచిది.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఇది శుభకాలం. బుద్ధి బలాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతను ప్రార్థించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి ఇవాళ అనుకూలమైన దినం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల అంతా మంచి జరుగుతుంది.

కన్య(Kanya)

ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. లక్ష్మీ స్త్రోత్రం చదవండి.

తుల(Thula)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు. మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివాలయ సందర్శనం మంచిది.

ధనుస్సు(dhanusu)

ఈ రాశివారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం(Makaram)

ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

మీనం(Meenam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. అమ్మవారిని ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది.

Updated On 19 Sep 2024 3:57 AM GMT
Eha Tv

Eha Tv

Next Story