ఈ రాశివారికి ఈవారం తిరుగేలేదు!

వార ఫలాలు.... ఈ రాశివారికి ఈవారం తిరుగేలేదు!

ఈవారంలో గురు కుజులిద్దరూ వృషభరాశిలో సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశిలో రవి గ్రహం, సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. బుధుడు వక్రించి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించినటువంటి శనీశ్వరుడు, మీన రాశిలో రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈవారం తుల, ధనుస్సు, వృశ్చిక రాశులలో సంచారం చేయబోతున్నాడు.

మేషం(mesham)

ఈ రాశివారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి పంచమస్థానమందు శుక్ర, బుధులు యోగిస్తు ఉండటం, అలాగే లాభస్థానంమందు శనీశ్వరుడి స్థితి, మరీ ముఖ్యంగా ఈవారంలో చంద్రబలం అధికంగా ఉండటం, గురుగ్రహం అనుకూలంగా ఉండటం మొదలైనవి ఈ రాశివారికి బలాన్ని ఇస్తున్నాయి. ఈ వారం మేషరాశివారు కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంగారాన్ని కొంటారు. చాన్నాళ్లుగా సోదరులు, మిత్రులతో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి.. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులకు ఇది తగిన సమయం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక,రాజకీయరంగాల వారికి ఇది అనుకూలించే వారం. అయితే వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అలాగే మిత్రులతో విభేదాలు రావచ్చు. ఎరుపు, నేరేడు రంగుల దుస్తులు ధరించండి. దుర్గాదేవిని పూజించండి.

వృషభం(vrushabam)

ఈ రాశివారికి ఈవారం మిశ్రమఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాల్య స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాలలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. గులాబీ రంగు దుస్తులు ధరించండి. హనుమాన్‌ చాలీసా చదవండి.

మిథునం(mithunam)

ఈ రాశివారికి ఈ వారం ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. బంధు మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. చిన్ననాటి మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తులుకు అనుకూల వాతావరణం ఉంది. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సూర్యారాధన చేయడం మంచింది.

కర్కాటకం(karkaram)

ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇల్లు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు కలిసివస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. పసుపు రంగు కలిసి వస్తుంది. విష్ణు సహస్రనామాలు పఠించాలి.

సింహం(simham)

ఈ రాశివారు కొత్తగా కొన్ని పనులు చేపడతారు. వాటిని సకాలంలోనే పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం ఇది. బంధు మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. రాజకీయరంగంలో ఉన్నవారికి పదవీయోగం ఉంది. వారం మధ్యలో అనవసరం ఖర్చులు వస్తాయి. ఆకుపచ్చ రంగు అనుకూలం. కనకధారాస్తోత్రాలు చదవండి.

కన్య (kanya)

ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది.

తీర్థయాత్రలు చేస్తారు. గతం తల్చుకుని సంతోషపడతారు. ఇంటి నిర్మాణంలో అడ్డంకులు వస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వస్తాయి. కళాకారులకు కూడా ఈ వారం బాగాలేదు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. పసుపు రంగు అనుకూలం. శివారాధన మర్చిపోవద్దు.

తుల..(thula)

ఈ వారం ఈ రాశివారికి కొంత అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరమవుతుంది. వాహనయోగం ఉంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆకుపచ్చ రంగు కలిసివస్తుంది. . శివాష్టకం చదవండి.

వృశ్చికం..(vruchikam)

ఈ రాశివారు ఎలాంటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలంగా ఉంటూ వస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భూములు, వాహనాలు కొంటారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. . విదేశీ యోగం ఉంది. వారం ప్రారంభంలో ఆరోగ్యం కొంత దెబ్బతింటుంది. ఖర్చులెక్కువ. నేరేడు రంగు ఉత్తమం. సూర్యుడిని ఆరాధించండి.

ధనుస్సు(dhanussu)

ఈ రాశివారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎరుపు, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం(makaram)

ఈ రాశివారు ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దుర్గారాధన మంచిది

కుంభం..(kumbam)

ఈ రాశివారు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమస్యలను చక్కదిద్దుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. మీ శక్తిసామర్థ్యాలను పదిమంది మెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం రంగు కలిసివస్తుంది. . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం..(meenam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు కొంటారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విపరీతమైన ఖర్చు ఉంటుంది. గులాబీ రంగు అనుకూలం. నవగ్రహలను పూజించండి.

Eha Tv

Eha Tv

Next Story