ఈ రోజు తిరుగులేదు.. అన్ని విజయాలే!

తేదీ 15 -సెప్టెంబరు -2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము ;- భాద్రపద మాసం

పక్షం : శుక్ల పక్షము

తిథి : ద్వాదశి

(ఈరోజు సాయంత్రం 6 గం 12 ని వరకు)

వారము:- ఆదివారం

నక్షత్రం : శ్రవణం

( ఈరోజు సాయంత్రం 6 గం 49 ని వరకు)

వర్జ్యం : మధ్యాహ్నం 12 గం 15ని నుంచి 01 గం 44 ని వరకు

తిరిగి రాత్రి 10 గం 26 ని నుంచి 11 గం 53 నిమి వరకు

అమ్రుతఘడియలు:- పగలు 11 గం॥ 46 ని॥ నుంచి 12 గం॥ 35 ని॥ వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 04 గం॥ 37ని॥ నుంచి 05 గం॥ 53ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 04 గం॥ 43 ని॥ నుంచి 06 గం॥ 14 ని॥ వరకు)

గుళికా : సాయంత్రం 03:12 నుంచి 04:43 వరకు

యమగండం : మధ్యాహ్నం 12:11 నుంచి 01:42 వరకు

సూర్యోదయం : ఉదయం 06 గం॥ 07 ని॥ లకు.

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 14 ని॥ లకు.

చంద్రోదయం : సాయంత్రం 04 గం॥ 22 ని॥లకు

చంద్రాస్తమయం : ఉదయం 03 గం॥ 58ని ॥లకు

మేషం(Mesham)

ఈ రాశివారు చిత్తశుద్ధితో చేసేపనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారు కొంచెం శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితాలు వస్తాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శివాలయాన్ని సందర్శించడం మంచిది.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యవిషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్దతులను అవలంబించడం మంచిది. లక్ష్మీపూజ చేయండి. శుభం కలుగుతుంది.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

సింహం(simham)

ఈ రాశివారికి ఇది మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలకు వినియోగించండి గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సుకు తృప్తిని ఇస్తుంది. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఇది అనుకూల సమయం కాదు. వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

తుల(Thula)

ఈ రాశివారు దైవబలంతో పనులను పూర్తిచేస్తారు.ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆలయ సందర్శన శ్రేయస్కరం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పరమ శివుడి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. దుర్గాదేవిని పూజించండి.

మకరం(Makaram)

ఈ రాశివారికి మనసులో కోరుకున్నది నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. మహాలక్ష్మిని ఆరాధించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శ్రేయస్కరం.

మీనం(Meenam)

ఈ రాశివారు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story