Today Rasiphalalu : ఈ వారం ఎవరికీ అనుకూలం.. ఎవరికీ ప్రతికూలం
ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభాఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభాఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం! ఈ వారంలో గురు కుజులు వృషభరాశియందు సంచరిస్తున్నారు. కర్కాటక రాశియందు రవి, సింహరాశిలో శుక్రుడు, అలాగే వక్రించినటువంటి బుధగ్రహం, కన్యారాశిలో కేతువు, కుభంలో వక్రించినటువంటి శనీశ్వరుడు, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తుల రాశులలో సంచరిస్తున్నాడు.
మేషరాశి(Mesham) : మేషరాశివారికి ఈ వారం చాలా సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తోంది. ప్రత్యేకించి రెండోస్థానంలో ఉన్న గురుడు ఉండటం, చంద్రబలం ఉండటం, పంచమ స్థానంలో ప్రధానంగా శుక్ర, బుధులు అనుకూలిస్తూ ఉండటం, అలాగే శనీశ్వరుడి బలం ఉండటం, ప్రత్యేకించి ఈ రాశి వారికి అయిదు గ్రహాల శుభఫలితాలు ఈవారంలో లభించబోతున్నాయి. అయితే ప్రధానంగా పంచమ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహాలు కూడుకుని ఉన్నాయో పంచమం అన్నది ప్రజ్ఞ బుద్ధి మేథస్సు వీటికి సంబంధించినటువంటి స్థానంగా చెబుతారు. ఈ రాశివారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండబోతున్నది. మనసుకు నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శిస్తారు. ఆత్మీయులతో సంభాషణలు జరుపుతారు. విద్యార్థినీవిద్యార్థులకు గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ విద్య, దూర విద్య, పోటీ పరీక్షలలో మంచి సావకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి శుభఫలితాన్ని ఇస్తుంది.
వృషభరాశి(Vrushabham) : ఈ రాశివారికి కూడా ఈ వారం అనుకూల గ్రహగతులే ఉన్నాయి. వీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితికి ఎదిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలు కలుగుతాయి. కష్టానికి ఫలితం దక్కుతుంది. అయితే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మితంగా ఖర్చు పెట్టడం మంచింది. ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజించాలి.
మిథున రాశి(Mithunam) : మిథున రాశివారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు చేస్తున్న కృషి సరిపోదు. కనిపించని శత్రువులతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వ్యాపారంలో నష్టాలను కట్టడి చేయాలి. చాన్నాళ్లుగా వేధిస్తున్న ఓ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. నవగ్రహలను స్తుతించాలి.
కర్కాట రాశి(Karkataka rasi) : ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం తలుపుతడుతుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఇంట్లో శుభాకార్యం జరుగుతుంది. ఈ రాశివారు లక్ష్మీదేవిని ధ్యానించాలి.
సింహరాశి(simha rasi) : ఈ రాశివారికి అవసరాలకు ధనం అందుతుంది. రుణ సమస్యలు తీరతాయి. ఉద్యోగంలో శ్రద్ధపెట్టాలి. తెలియనివారిని నమ్మకండి. మోసం చేసే ప్రమాదం ఉంది. శ్రమ కొంచెం ఎక్కువైనా ఫలితం సంతృప్తినిస్తుంది. ఓర్పు చాలా అవసరం. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. పరమశివుడిని ప్రార్థించండి
కన్య రాశి(Kanya rasi) : ఈ రాశివారికి ఉద్యోగంలో శుభఫలితాలు కనిపిస్తాయి. కోరుకున్నవి నెరవేరతాయి. ఉద్యోగాల్లో పదోన్నతి కలిగే అవకాశం ఉంది. జీవితంలో స్థిరపడే కాలం ఇది. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.
తులరాశి(tula rasi) : ఈ రాశివారికి అభీష్ట సిద్ధిస్తుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగులకు మంచి కాలం. తగిన గుర్తింపు దక్కుతుంది. బుద్ధిబలంతో పని చేసి విజయాలు సాధిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని స్తుతించాలి.
వృశ్చికం(Vruchikam) : ఈ రాశి వారికి అదృష్టం బాగుంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోకూడదు. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుంది. విఘ్నాలు తొలిగిపోతాయి. ఆటంకాలు ఎదురైతే నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. కుటుంబ సలహాలు పాటించండి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు(dhanussu rasi) : ఈ రాశివారిక ఈ వారం అనుకూలంగా ఉంది. కొత్త పనులకు ఇది సరైన సమయం. పెద్దల అండదండలు లభిస్తాయి. ఆగిపోయిన పనులకు చలనం వస్తుంది. ధనయోగం ఉంది. కొత్తగా పెట్టుబడులు వస్తాయి. ఓ ప్రమాదం నుంచి బయటపడతారు. సూర్య భగవానుడిని ఆరాధించాలి.
మకర రాశి(Makara) : ఈ రాశివారికి మనోబలం చాలా అవసరం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలగాలి. అందుకు మానసికంగా సంసిద్ధం కావాలి. సుదీర్ఘ కల నెరవేరబోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఇంటిలోకి అడుగుపెడతారు. వాహన యోగం కూడా ఉంది. బంగారు ఆభరణాలు కొంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.
కుంభ రాశి(Kumbha rasi) : ఈ రాశివారికి ఈవారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ వల్ల నలుగురు ప్రయోజనం పొందుతారు. వీలు చూసుకుని కుటుంబంతో గడపండి. వారాంతంలో మంచి వార్త వింటారు. నవగ్రహలను పూజించాలి.
మీన రాశి(Meena rasi) : ఈ రాశివారికి మనో ధైర్యం ఎక్కువ. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మొహమాటం మొదటికే మోసం. వారం మధ్యలో సుదీర్ఘకాలంగా బాధపెడుతున్న ఓ సమస్య నుంచి మోక్షం లభిస్తుంది. శివుడిని పూజించాలి.