astrology,rasi phalalu,horoscope,daily predictions,today rasi phalalu,ehatv

తేది : 17,సెప్టెంబరు -2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : భాద్రపద మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : మంగళవారం

పక్షం : శుక్ల పక్షము

తిథి : చతుర్దశి

(ఈరోజు ఉదయం 10గం 56ని వరకు

⭐నక్షత్రం : శతభిషం

ఈరోజు పగలు 2 గం 19 ని వరకు

వర్జ్యం : ( ఈరోజు రాత్రి 8 గం 18 ని నుండి 9 గం 48 ని వరకు

అమ్రుతఘడియలు : ఈరోజు ఉదయం 7 గం 43 ని నుండి 9గం 13ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 48 ని॥ నుంచి 11గం॥ 36 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు పగలు 3 గం॥ 00 ని॥ నుంచి 4 గం॥ 30 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు.

🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 03 ని ॥ లకు.

మేషం(Mesham) : ఈ రాశివారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

వృషభం(Vrushabham) : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనిభారం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. ఎప్పుడూ సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ వ్యవహారాలు సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గాదేవి స్తోత్రం చదివితే బాగుంటుంది.

మిథునం(Mithunam) : ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని పూజించండి

కర్కాటకం(Karkatakam) : ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శివాలయ సందర్శన మానసిక బలాన్ని ఇస్తుంది.

సింహం(Simham) : ఈ రాశివారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీమీ రంగాల్లో మంచే జరుగుతుంది. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

కన్య(Kanya) : ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల(Thula) : ఈ రాశివారు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం(Vruchikam) : ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ధనుస్సు(Dhanusu) : ఈ రాశివారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి.శివాలయ సందర్శన మానసిక బలాన్ని ఇస్తుంది.

మకరం(Makaram) : ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. శివుడికి పూజలు చేయండి.

కుంభం(Kumbham) : ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం(Meenam) : ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి.శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శ్రేయస్కరం.

Eha Tv

Eha Tv

Next Story