ఈ రాశివారికి సకాలంలో డబ్బు అందుతుంది!

తేదీ 24 -ఆగష్టు -2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము ;- శ్రావణ మాసం

పక్షం : కృష్ణ పక్షము

తిథి : పంచమి

(ఈరోజు పగలు 12 గం 51 ని వరకు)

వారము:- శనివారం

నక్షత్రం : అశ్వినీ

( ఈరోజు రాత్రి 11గం 49 ని వరకు)

వర్జ్యం : రాత్రి 8 గం 5 ని నుండి 9 గం 35 ని వరకు

అమ్రుతఘడియలు:-సాయంత్రం 5 గం 14 ని నుండి 6గం 43ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 06 గం॥ 00ని॥ నుంచి 07 గం॥ 36ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 09 గం॥ 00 ని॥ నుంచి 10గం॥ 30 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 48 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 19 ని॥ లకు

మేషం(Mesham)

ఈ రాశివారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. దుర్గాదేవి స్తోత్రం చదివితే బాగుంటుంది.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనిభారం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. ఎప్పుడూ సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ వ్యవహారాలు సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి

మిథునం(Mithunam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శ్రేయస్కరం.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శివాలయ సందర్శన మానసిక బలాన్ని ఇస్తుంది.

సింహం(Simham)

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీమీ రంగాల్లో మంచే జరుగుతుంది. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. అమ్మవారిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య(Kanya)

ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

తుల(Thula)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదైవాన్ని పూజించండి.

మకరం(Makaram)

ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. శివుడికి పూజలు చేయండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం(Meenam)

ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Eha Tv

Eha Tv

Next Story