ఈ రాశివారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు.

02.09.2024,సోమవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షo

తిథి:అమావాస్య పూర్తి

వారం:ఇందువాసరే

(సోమవారం)

నక్షత్రం:మఖ రా12.36 వరకు

యోగం:శివం రా7.49 వరకు

కరణం:చతుష్పాత్ సా 5.29 వరకు

వర్జ్యం: ఉ11.40 - 1.24

దుర్ముహూర్తము: మ12.45 - 1.14

మరల మ2.53 - 3.43

అమృతకాలం: రా10.01 - 11.44

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం:6.15

మేషం (Mesham)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకోండి. హడావుడి పడకండి. మొహమాటాలను దూరం పెట్టండి. శివారాధన చేయండి. మంచి జరుగుతుంది.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబసభ్యుల సాయంతో పనులు పూర్తి అవుతాయి. వ్యయంలో చంద్రబలం అనుకూలంగా లేదు. మీరు అమితంగా నమ్మినవారే మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవిని పూజించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి చాలా అనుకూలమైన రోజు ఇది! పనులు ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తవుతాయి. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీపూజ చేయండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులతో వాదోపవాదాలు తగవు. . మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం(Simham)

ఈ రాశివారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం. మీ ప్రతిభతో అందరి ప్రశంసలను అందుకుంటారు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య(Kanya)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేయడానికి అన్ని విధాలా కృషిచేస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. గణపతి ఆరాధన చేయండి. శుభం కలుగుతుంది.

తుల(Thula)

ఈ రాశివారు కీలక విషయాలలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. అప్పులకు దూరంగా ఉండండి. శివాలయాన్ని సందర్శించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. సూర్యభగవానుడిని పూజించండి.

ధనుస్సు(Dhanushu)

ఈ రాశివారు అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి అధికంగా శ్రమించాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం.

మకరం(Makaram)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. మీలోని వినయ విధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్న వారు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. బంధు మిత్రులతో ఆచితూచి మాట్లాడండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఉత్తమం.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

మీనం(Meenam)

మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్యసాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. వినాయకుడి ఆరాధన శుభప్రదం.

ehatv

ehatv

Next Story