ఈ రాశివారు అప్రమత్తతో ఉండాలి!

మేషం(Mesham)

ఈ రాశివారు అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. పరమేశ్వరుడిని పూజించడం శ్రేయస్కరం

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి అనుకూలమైన దినమిది! ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. మహాలక్ష్మిని ఆరాధించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కలహ సూచన ఉంది. ఆంజనేయస్వామిని పూజించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారు కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

సింహం(SImham)

ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. గణపతి స్తోత్రాన్ని పఠించండి. అంతా మంచే జరుగుతుంది.

కన్య(Kanya)

ఈ రాశివారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అష్టలక్ష్మీ స్తుతి మంచిది.

తుల(Thula)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శివుడిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు అప్రమత్తతో మెలగడం అవసరం. కీలకమైన పనులను ప్రారంభించే ముందు సాధక బాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

ధనుస్సు(Dhanussu)

ఈ రాశివారు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యనారాయణుడిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.

మకరం(Makaram)

ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అమ్మవారిని పూజించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శ్రేయస్కరం .

మీనం(Meenam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం.. శ్రీలక్ష్మీధ్యానం మంచిది.

Updated On 30 Aug 2024 4:39 AM GMT
Eha Tv

Eha Tv

Next Story