ఈ రాశివారు మొహమాటాన్ని పక్కన పెడితే తిరుగేలేదు!

23.08.2024,శుక్రవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి మ3.29 వరకు. భృగువాసరే

వారం:( శుక్రవారం )

నక్షత్రం:రేవతి రా1.36 వరకు

యోగం:శూలం మ3.36 వరకు

కరణం:బాలువ మ3.29 వరకు

తదుపరి కౌలువ రా2.16 వరకు

వర్జ్యం:మ2.26 - 3.55

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.07

మరల మ12.28 - 1.18

అమృతకాలం:రా11.22 - 12.51

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: మీనం

సూర్యోదయం:5.47

సూర్యాస్తమయం:6.19

మేషం(Mesham)

ఈ రాశివారు కాసింత అప్రమత్తతతో ఉండాలి. అధికారులతో వాదోపవాదాలు తగదు. కీలకమైన విషయాలలో జాగ్రత్త ఎంతో అవసరం. అనవసర ఖర్చులు జరగవచ్చు. ఏ విషయంలోనూ డీలా పడకండి. శివాలయ సందర్శన మంచిది.

వృషభం(Vrushabam)

ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఓ శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాదేవిని స్తుతించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గతంలో పట్టించుకోకుండా వదిలేసిన విషయాలు ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారు మొహమాటాన్ని పక్కన పెట్టాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కీలకమైన పనులను మొదలుపెడతారు. తిండి విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. నరసింహస్వామి స్తోత్రం చేయండి.

సింహం(simham)

ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగానే ఉంది. కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. దుర్గాదేవిని పూజించడం మంచిది.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఇవాళ బ్రహ్మండంగా ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, సంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి.

తుల(Thula)

ఈ రాశివారు పట్టుదలతో ఉండండి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. మీ తెలివితేటలకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు కీలకమైన పనులను ప్రారంభించే ముందు సాధక బాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం(Makaram)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహాలను పూజించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. శివారాధన చాలా మంచిది.

మీనం(Meenam)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విజయాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. దుర్గాదేవిని పూజించండి.

Eha Tv

Eha Tv

Next Story