ఈ రాశివారికి అన్ని శుభ ఫలితాలే!

22.08.2024,గురువారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:తదియ సా 5.57 వరకు

బృహస్పతివాసరే,(గురువారం)

నక్షత్రం: ఉత్తరభాద్ర తె 3.16 వరకు

యోగం: ధృతి సా6.41 వరకు

కరణం:వణిజ ఉ7.09 వరకు

తదుపరి విష్ఠి సా5.57 వరకు

ఆ తదుపరి బవ తె 4.43 వరకు

వర్జ్యం:మ1.52 - 3.21

దుర్ముహూర్తము:ఉ 9.57 - 10.48

మరల 2.59 - 3.49

అమృతకాలం:రా10.48 - 12.17

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం: ఉ6.00 - 7.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: మీనం

సూర్యోదయం:5.47

సూర్యాస్తమయం:6.20

మేషం(Mesham)

ఈ రాశివారు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడు మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోకండి. సన్నిహితుల సలహాలు తీసుకోండి. కీలక విషయాలను కుటుంబసభ్యులతో చర్చించండి. . ద్వాదశంలో చంద్ర స్థితి అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన మీకు మనస్తాపం కలిగిస్తుంది. శత్రువులతో అప్రమత్తంగా ఉండండి. సమయాన్ని వృథా చేయకండి. అమ్మవారిని ఆరాధించండి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉన్నాయి. సంపద చేకూరే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. మిత్రులు సమయానికి సహాయం చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. శివుడిని ఆరాధించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి అందరి మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. ఆలయ సందర్శనం శ్రేయస్కరం.

కర్కాటకం(Karkatam)

ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనాలోచిత నిర్ణయాలు మంచిది కాదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధించండి.

సింహం(simham)

ఈ రాశివారికి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఇష్టదేవతను పూజించండి.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఈరోజు కాస్త అనుకూలంగానే ఉంది. దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. వినాయకుడిని పూజించండి.

తుల(Thula)

ఈ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. దుర్గాదేవిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణుసహస్ర నామాలు పఠించండి.

ధనుస్సు(Dhanusu)

మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. అంతా శుభమే జరుగుతుంది.

మకరం(Makaram)

ఈరాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆంజనేయస్వామిని ధ్యానించండి.

కుంభం(Kumbam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.

మీనం(Meenam)

ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం,విషయంలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గాదేవిని పూజించండి.

Eha Tv

Eha Tv

Next Story