ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి!

01.09.2024,ఆదివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి తె4.52 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:ఆశ్రేష రా 10.45 వరకు

యోగం:పరిఘము రా 7.53 వరకు

కరణం:భద్ర సా 4.25 వరకు

తదుపరి శకుని తె 4.52 వరకు

వర్జ్యం:ఉ10.53 - 12.35

దుర్ముహూర్తము: సా4.33 - 5.23

అమృతకాలం: రా 9.03 - 10.45

రాహుకాలం: సా4.30 - 4.00

యమగండ/కేతుకాలం: మ12.00 - 1.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం:6.15

మేషం(Mesham)

ఈ రాశివారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గా పూజ చేయడం శ్రేయస్కరం.

వృషభం(Vrushabham)

ఈ రాశివారు మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వినాయకుడిని పూజించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. శివాలయ సందర్శన మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం(simham)

ఈ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మహాలక్ష్మీ ఆరాధన ఉత్తమం.

కన్య(Kanya)

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మహావిష్ణువును ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది.

తుల(Thula)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. దుర్గాపూజ చేయండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి మంచి ఫలితాలు ఉన్నాయి. సంతృప్తికరమైన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఆలయ సందర్శన మంచిది.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారు అప్రమత్తతో మెలగడం మంచిది. ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. అమ్మవారిని ఆరాధించండి.

మకరం(Makaram)

ఈ రాశివారు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. నవగ్రహాలను పూజించండి.

కుంభం(Khumbham)

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం(Meenam)

ఈ రాశివారు పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. మనఃస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. శివాలయ సందర్శన చాలా మంచిది.

Eha Tv

Eha Tv

Next Story