ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది!

29.08.2024,గురువారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:ఏకాదశి తె3.44 వరకు

వారం: బృహస్పతివాసరే

(గురువారం)

నక్షత్రం:ఆర్ధ్ర రా8.02 వరకు

యోగం:సిద్ధి రా10.25 వరకు

కరణం:బవ సా4.02 వరకు

తదుపరి బాలువ తె 3.44 వరకు

వర్జ్యం:ఉ6.04 వరకు

దుర్ముహూర్తము: ఉ9.56 - 10.46

మరల మ2.55 - 3.45

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: మిథునం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం:6.15

మేషం(Mesham)

ఈ రాశి వారు సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

మిథునం(Mithunam)

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. తన కోపమే తన శత్రువు అని తెలుసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. శివారాధన చేయండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారు శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అమ్మవారిని పూజించండి.

సింహం(simham)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది! సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శివాలయ సందర్శన శ్రేయస్కరం.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

తుల(Thula)

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. శివారాధన చేయండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

ధనుస్సు(dhanusu)

ఈ రాశివారు పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలు ఉన్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. వినాయకుడిని పూజించండి.

మకరం(Makaram)

ఈ రాశివారు ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారు ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. చేయని తప్పునకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మహాలక్ష్మీని పూజించండి.

మీనం(Meenam)

ఈ రాశి వారికి అనుకూలమైన రోజు ఇది. పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

Eha Tv

Eha Tv

Next Story