ఈ రాశివారికి సౌభాగ్య సిద్ధి ఉంది!

తేది :05 సెప్టెంబర్ 2024

సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము:- భాద్రపద మాసం

పక్షం : శుక్ల పక్షము

తిథి :విదియ

(ఈరోజు ఉదయం 9 గం॥ 32 ని॥ వరకు

వారము;- గురువారం

నక్షత్రం : హస్త

(ఈరోజు వరకు పూర్తిగా ఉంది )

వర్జ్యం : ( ఈరోజు పగలు 2గం 17ని నుండి 4గం 3ని వరకు)

అమ్రుతఘడియలు;- ఈరోజు రాత్రి 1 గం 13 ని నుండి 3 గం 00 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10గం॥ 00 ని॥ నుంచి 10 గం॥ 48 ని॥ వరకు)పునః ప.2-48ని నుండి 3-36ని వరకు

రాహుకాలం : (ఈరోజు పగలు 1 గం॥ 30 ని॥ నుంచి 3 గం॥ 00 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 49 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 09 ని॥ వరకు

మేషం(Mesham)

ఈ రాశివారు నూతన కార్యక్రమాలను చేపడతారు. దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుంది. అనూహ్య ధనలాభం పొందుతారు. మహాలక్ష్మీని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృషభం(Vrushbham)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ నమ్మకండి. శివారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులకు వెళ్లకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి, చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మహావిష్ణువును ఆరాధించడం శ్రేయస్కరం.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. దుర్గాదేవిని పూజించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడిని జయించండి. మానసిక స్థయిర్యాన్ని కోల్పోకండి. బంధు,మిత్రులను కలుపుకొనివెళ్లడం మంచిది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని అందిస్తాయి.పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. పరమశివుడిని పూజించండి.

కన్య(Kanya)

ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని ఆరాధించండి.

తుల(Thula)

ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం దక్కుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శ్రేయస్కరం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దాని కన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. నవగ్రహాలను ప్రార్థించండి.

ధనుస్సు(dhanusu)

ఈ రాశివారికి ఇది అత్యంత శ్రేష్ఠమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అమ్మవారి ఆరాధన చాలా మంచిది.

మకరం(Makaram)

ఈ రాశివారు అప్రమత్తతతో మెలగడం అవసరం. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఆపద, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహం సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. వినాయకుడిని పూజించండి. గణపతి స్తోత్రం పఠించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులు సహకారం లభిస్తుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి.మొహమాటాన్ని వీడండి. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

మీనం(Meenam)

ఈ రాశివారికి కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

Eha Tv

Eha Tv

Next Story