ఈ రాశివారికి కర్మసిద్ధి ఉంది!

తేది 04 సెప్టెంబరు -2024

సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : భాద్రపద మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : బుధవారం

పక్షం : శుక్ల పక్షము

తిథి : పాడ్యమి

(ఈరోజు ఉదయం 7గం 34 ని వరకు

⭐నక్షత్రం : ఉత్తర

ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4 గం 57 ని వరకు

వర్జ్యం :- ఉదయం 10గం 23 ని నుండి 12 గం 09 ని వరకు

అమ్రుతఘడియలు:- ఈరోజు రాత్రి 9 గం 16 ని నుండి 11 గం 02 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి 12 గం॥ 24 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు పగలు 12 గం॥ 00 ని॥ నుంచి 1 గం॥ 30 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 49 ని॥ లకు.

🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6గం॥ 10 ని॥ లకు.

మేషం(Mesham)

ఈ రాశివారికి కర్మసిద్ధి ఉంది. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం(Vrushabham)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శ్రేయస్కరం.

మిథునం(Mithunam)

ఈ రాశివారు కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.దగ్గరివారిని దూరం చేసుకోకండి. రామాలయ సందర్శన మంచిది.

సింహం(Simham)

ఈ రాశివారికి ఈ రోజు శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. నరసింహస్వామిని కొలవండి.

కన్య(Kanya)

ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. కీలక వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఆశించినట్టుగానే వారి సూచనలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వండి. ఆలయ సందర్శన మంచిది.

తుల(Thula)

ఈ రాశివారికి కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. వాటిని మీ తెలివితో పరిష్కరించుకుంటారు. వినాయకుడిని పూజించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి ఈ రోజు బాగానే ఉంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధికోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా వాదులాటకు దిగకండి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. అయితే ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. మంచి పనుల మీద మనసు పెట్టండి. లక్ష్మీదేవిని ఆరాధించండి.

మకరం(Makaram)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఓ శుభవార్తను వింటారు. శివారాధన శ్రేయస్కరం.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి కూడా మిశ్రమ వాతావరణం గోచరిస్తుంది. తెలివితేటలను ప్రదర్శిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ఆందోళనపడతారు. దుర్గాదేవిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది.

మీనం(Meenam)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. మనసు చెడు పనుల మీదకు మళ్లకుండా చూసుకోండి. అనవసర ఖర్చు ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Eha Tv

Eha Tv

Next Story