ఈ రాశివారికి సాహసోపేత విజయాలు లభిస్తాయి..!

బుధవారం, ఆగష్టు 28, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:దశమి తె4.21 వరకు

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:మృగశిర రా8.05 వరకు

యోగం:వజ్రం రా12.02 వరకు

కరణం:వణిజ సా4.53 వరకు

తదుపరి విష్ఠి తె4.21 వరకు

వర్జ్యం:తె4.28 నుండి

దుర్ముహూర్తము;ఉ11.37 - 12 26

అమృతకాలం:ఉ11.27 - 1.01

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం:6.16

మేషం(Mesham)

ఈ రాశివారికి ఈ రోజు శుభ సమయం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కార్యక్రమాలు సఫలం అవుతాయి. అనుకున్నది సాధిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధించాలి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. ఆలయ సందర్శన శ్రేయస్కరం.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వినాయకుడిని పూజించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఈ రోజు సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల జోలికి వెళ్లకండి. దుర్గాపూజ చేయండి.

సింహం(simham)

ఈ రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధికోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. ఇతరుల తగవులో తలదూర్చకండి. శివుడిని ఆరాధించండి.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నవగ్రహాలను పూజించండి.

తుల(Thula)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి కూడా ఇవాళ బాగుంది. ప్రారంభించిన పనులలో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. అమ్మవారిని ఆరాధించండి.

ధనుస్సు(Dhanussu)

ఈ రాశివారికి ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. సీతారామంజనేయులను పూజించండి.

మకరం(Makaram)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీవేంకటేశ్వర ఆలయ సందర్శనం శుభప్రదం.

కుంభం(Kumbham)

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. నవగ్రహ శ్లోకం పఠించండి.

మీనం(Meenam)

ఈ రాశివారు ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శివాలయాన్ని సందర్శించండి.

Eha Tv

Eha Tv

Next Story