ఈ రాశివారికి ఆర్ధిక పురోగతి ఉంది!

02.09.2024,మంగళవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి: అమావాస్య ఉ 6.08 వరకు

తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి

వారం:భౌమవాసరే

మంగళవారం

నక్షత్రం :పుబ్బ రా2.50 వరకు

యోగం :సిద్ధం రా8.03 వరకు

కరణం :నాగవం ఉ6.08 వరకు

తదుపరి కింస్తుఘ్నం సా6.59 వరకు

వర్జ్యం:ఉ9.20 - 11.05

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.06

మరల రా10.50 - 11.36

అమృతకాలం:రా7.50 - 9.35

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం :ఉ9.00 - 10.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం:6.15

మేషం(Mesham)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. మనసు చెడు పనుల మీదకు మళ్లకుండా చూసుకోండి. అనవసర ఖర్చు ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి కూడా మిశ్రమ వాతావరణం గోచరిస్తుంది. తెలివితేటలను ప్రదర్శిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ఆందోళనపడతారు. దుర్గాదేవిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఓ శుభవార్తను వింటారు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. అయితే ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. మంచి పనుల మీద మనసు పెట్టండి. లక్ష్మీదేవిని ఆరాధించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి ఈ రోజు బాగానే ఉంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధికోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా వాదులాటకు దిగకండి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య(Kanya)

ఈ రాశివారికి కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. వాటిని మీ తెలివితో పరిష్కరించుకుంటారు. వినాయకుడిని పూజించండి.

తుల(Thula)

ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. కీలక వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఆశించినట్టుగానే వారి సూచనలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వండి. ఆలయ సందర్శన మంచిది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి ఈ రోజు శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. నరసింహస్వామిని కొలవండి.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారికి ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.దగ్గరివారిని దూరం చేసుకోకండి. రామాలయ సందర్శన మంచిది.

మకరం(Makaram)

ఈ రాశివారు కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అమ్మవారిని ఆరాధించండి.

కుంభం(Kumbham)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శ్రేయస్కరం.

మీనం(Meenam)

ఈ రాశివారికి కర్మసిద్ధి ఉంది. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story