ఈ రాశివారికి తమ తమ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి.

20.08.2024,మంగళవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి రా10.38 వరకు

భౌమవాసరే ,(మంగళవారం)

నక్షత్రం:ధనిష్ఠ ఉ7.55 వరకు

యోగం:అతిగండ రా12.39 వరకు

కరణం:బాలువ ఉ11.41 వరకు

తదుపరి కౌలువ రా10.38 వరకు

వర్జ్యం:మ2.41 - 4.12

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.07

మరల రా10.54 - 11.40

అమృతకాలం:రా11.44 - 1.14

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: కుంభం

సూర్యోదయం:5.47

సూర్యాస్తమయం:6.20

మేషం (Mesham)

ఈ రాశివారికి ఈ రోజు బాగానే ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాదేవిని ధ్యానించండి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి ఈ రోజు కాస్త అనుకూలంగానే ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివారాధన మంచిది.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు విచక్షణాజ్ఞానంతో ముందుకు సాగండి. శ్రీమహాలక్ష్మిని పూజించండి.

కర్కాటకం(Karkataka)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పనితీరుతో మీ అధికారులను ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి ఓ సంఘటన బాధను కలిగిస్తుంది. అంతకు మించి ఈ రోజు వీరికి అనుకూలంగానే ఉంది. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు సత్ఫలితాలు ఇస్తాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వినాయక స్తోత్రం చేయండి.

కన్య(Kanya)

ఈ రాశివారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. బుద్ధిబలంతో ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శనీశ్వరుడిని పూజించండి.

తుల(Tula)

ఈ రాశివారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్ధిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. సీతారాములను పూజించండి.

వృశ్చికం(Vruchika)

ఈ రాశివారు తమ పనితీరుతో అందరి మెప్పు పొందుతారు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవాన్ని పూజించండి.

ధనుస్సు( Dhanusha)

ఈ రాశివారికి ఇవాళ అనుకూలమైన సమయం. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

మకరం(Makaram)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడిని పూజించండి.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి మిశ్రమకాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. అమ్మవారిని ఆరాధించండి.

మీనం(Meenam)

ఈ రాశివారికి దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీమహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

ehatv

ehatv

Next Story