ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు జరుగుతాయి. సౌభాగ్యసిద్ధి ఉంది.

19.08.2024,సోమవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:పూర్ణిమ రా12.43 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:శ్రవణం ఉ9.04 వరకు

యోగం:సౌభాగ్యం ఉ6.01 వరకు తదుపరి శోభన తె3.26 వరకు

కరణం:విష్ఠి మ1.38 వరకు తదుపరి బవ రా12.43 వరకు

వర్జ్యం:మ12.52 - 2.23

దుర్ముహూర్తము:మ12.28 - 1.19

మరల మ2.59 - 3.50

అమృతకాలం:రా10.00 - 11.31

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి:సింహం

చంద్రరాశి: మకరం

సూర్యోదయం:5.46

సూర్యాస్తమయం:6.21

మేషం (Mesham)

ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు జరుగుతాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి మీకు సాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి అంతా మంచే జరుగుతుంది.

వృషభం (vrushabam)

ఈ రాశివారికి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త అప్రమత్తతతో మెలగడం అవసరం . ఇష్టదేవతను ప్రార్థించండి.

మిథునం (Mithunam)

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. . శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

కర్కాటకం (Karkatam)

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. దైవారాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

సింహం (Simham)

ఈ రాశివారికి ఈరోజున శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. విందు భోజనం చేస్తారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. దుర్గారాధన చేయండి.

కన్య (Kanya)

ఈ రాశివారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోకండి. కీలక విషయాల్లో సన్నిహితుల సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

తుల (thula)

ఈ రాశివారికి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం (vruchikam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను కలిగించే అంశాలు చోటు చేసుకుంటాయి. మహా విష్ణువును పూజించండి.

ధనుస్సు (Dhanussu)

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. వినాయకుడిని పూజించండి.

మకరం (Makaram)

ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. శివుడిని పూజించండి.

కుంభం (Kumbam)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

మీనం (Meenam)

ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శివారాధన మంచిది.

ehatv

ehatv

Next Story