ఈ రాశివారు ఓ శుభవార్త వింటారు...

ఈ రాశివారు ఓ శుభవార్త వింటారు...

12.08.2024,సోమవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:అష్టమి తె4.44 వరకు

వారం:సోమవారం

(ఇందువాసరే)

నక్షత్రం:విశాఖ పూర్తి

యోగం:శుక్లం మ2.35 వరకు

కరణం:విష్ఠి సా4.05 వరకు తదుపరి బవ తె4.44 వరకు

వర్జ్యం:ఉ11.36 - 1.20

దుర్ముహూర్తము:మ12.30 - 1.21

మరల మ3.02 - 3.53

అమృతకాలం:రా9.59 - 11.43

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి: తుల

సూర్యోదయం:5.45

సూర్యాస్తమయం:6.25

మేషం(Mesham)

ఈ రాశివారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీరు మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన మరవకండి

వృషభం(Vrushabam)

మీ పనితీరుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ఇవాళ ఓ శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవండి.

కర్కాటకం(Karkatam)

ఈ రాశివారికి వారి మనోధైర్యమే వారిని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందినిస్తాయి. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. విష్ణు నామస్మరణ చేయండి.

సింహం(simham)

ఈ రాశివారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. కొన్ని సంఘటనలు మీకు మనో వేదనను కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. గణపతి స్తోత్రం చదివితే అంతా మంచే జరుగుతుంది.

కన్య(Kanya)

మీ స్నేహితుల సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించండి. తొందరపాటుతో వ్యవహరించి సమస్యలు తెచ్చుకోకండి. దుర్గాదేవిని ఆరాధించండి.

తుల(thula)

ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam)

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. లక్ష్మీఅష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు(Dhanussu)

మీరు చేపట్టిన పనులు మంచి ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

మకరం(Makaram)

ఈ రాశివారికి కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహ సూచితం, తోటివారిని కలుపుకు పోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.

మీనం(Meenam)

ఈ రాశివారికి ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

Eha Tv

Eha Tv

Next Story