ఈరోజు రాశి ఫలాలు
మేషం(Mesham): ఈ రాశివారి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగాఉండాలి. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృషభం(vrushabam) : ఆకస్మిక ధననష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులు, సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి.
మిథునం(Mithunam) : సరైన సమయంలో భోజనం లేకపోవడం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. మనసు నిలకడగా ఉండదు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
కర్కాటకం(Karkatam): ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగరీత్యా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనలు ఉండే అవకాశం ఉంది. స్త్రీలు చేసే పనులతో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం(simham): మానసికంగా కొంత ఉత్సాహంగా ఉంటారు. వాయిదా వేసుకున్న పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు
కన్య(Kanya): తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు.
తుల(Thula): ఈ రాశివారికి రుణాలు లభిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలి. పలు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి
వృశ్చికం(Vruchikam): కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు.. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది
ధనుస్సు(Dhanussu): ఈ రాశివారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి.
మకరం(Makaram): ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాల్లో కొంత ఆలస్యం జరుగొచ్చు. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
కుంభం(Kumbam): ఈ రాశివారికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువ ఆవేశపడకూడదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం నిలబడుతుంది.