అ రాశివారికి చికాకులు తప్పవు

10.08.2024, శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష రుతువు, శ్రావణమాసం,

తిథి: శు.పంచమి ప.03:14 వరకు. షష్టి ప్రారంభం, నక్షత్రం: హస్త ప. 02:44 వరకు, తదుపరి చిత్త , వర్జ్యం: మ.12.03 నుంచి 01:05 వరకు, దుర్ముహూర్తం: ఉ.6:30 నుంచి 7:32 వరకు, రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.59, సూర్యాస్తమయం: 6.46.

మేషం(Mesham)

ఈ రాశి వారు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. శివారాధన చేయండి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం. అమ్మవారిని ప్రార్థించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

మిథునం(Mithunam)

దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. నవగ్రహ ఆరాధన మంచిది. ఆలయాన్ని సందర్శించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. దుర్గాస్తోత్రం చదవండి.

కర్కాటకం(Karkatam)

ఈ రాశివారికి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యయ ప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచిది. లక్ష్మీదేవిని పూజించండి.

సింహం(simham)

రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వినాయక స్తోత్రం చదవండి.

కన్య(Kanya)

ఈ రాశివారు కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. ఆప్తులతో సఖ్యత. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు. శివుడిని పూజించండి.

తుల(Thula)

ఈ రాశివారికి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు రాగలవు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం.(Vruchikam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవారాధన తప్పనిసరిగా చేయండి.

ధనుస్సు.(dhanussu)

ఈ రాశివారికి ఈ రోజు కాస్త ప్రతికూలంగానే ఉంది. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నవగ్రహ పూజ మంచిది.

మకరం(Makaram)

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దుర్గాదేవిని పూజించండి.

కుంభం(Kumbam)

పనులలో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. సుబ్రహ్మణ్వస్వామిని ఆరాధించండి.

మీనం(Meena)

ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి. నరసింహస్వామిని ఆరాధించండి.

Eha Tv

Eha Tv

Next Story