ఈ రాశివారు అకారణ గొడవల్లో తలదూర్చకండి

ఈ రాశివారు అకారణ గొడవల్లో తలదూర్చకండి

17.08.2024,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి తె4.04 వరకు

స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:పూర్వాషాఢ ఉ10.21 వరకు

యోగం:ప్రీతి ఉ10.22 వరకు

కరణం:కౌలువ సా4.36 వరకు

తదుపరి తైతుల తె4.04 వరకు

వర్జ్యం:రా6.12 - 7.46 మరల రా7.58 - 9.34

దుర్ముహూర్తము: ఉ 5.46 - 7.26

అమృతకాలం:ఉ7.09 వరకు

మరల తె3.37 - 5.11

రాహుకాలం: ఉ 9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం:5.46

సూర్యాస్తమయం:6.23

మేషం(Mesham)

ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. శ్రీ సీతారామాంజనేయులను పూజించండి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరగవచ్చు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన చేస్తే ఫలితం దక్కుతుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గా పూజ చేయండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఇవాళ బాగానే ఉంది. సమాజంలో గొప్ప పేరుప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి.

సింహం(simham)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును కష్టపెడుతుంది. అకారణంగా గొడవలు పడతారు. దైవారాధన చేయండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కన్య(Kanya)

ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన మంచిది.

తుల(Thula)

ఈ రాశివారికి ఇది అనుకూల సమయం. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. గణపతి ఆరాధన శుభకరం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు(Dhanussu)

ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ప్రారంభించబోయే పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మకరం(Makaram)

ఈ రాశివారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని విషయంలో అశ్రద్ధ చేయకండి. సూర్య భగవానుడి ఆరాధన శుభదాయకం.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. మీ బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్షి ఆరాధన చేయండి..

మీనం(Meenam)

ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం మంచిది.

Eha Tv

Eha Tv

Next Story