Today Rasi Phalalu:ఈ రాశివారికి సౌభాగ్య సిద్ధి ఉంది!
ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి.
తేది :12 సెప్టెంబర్ 2024
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
ఋతువు : వర్ష ఋతువు
మాసము:- భాద్రపద మాసం
పక్షం : శుక్ల పక్షము
తిథి :నవమి
(ఈరోజు సాయంత్రం
5 గం॥ 54 ని॥ వరకు
వారము;- గురువారం
⭐నక్షత్రం : మూల
(ఈరోజు సాయంత్రం 5గం 47ని వరకు )
వర్జ్యం : ( ఈరోజు సాయంత్రం 4గం 8ని నుండి 5గం 47ని వరకు)
పునః రాత్రి 3గం 25ని నుండి 5గం 2ని వరకు
అమ్రుతఘడియలు;- ఈరోజు పగలు 11 గం 27 ని నుండి 1 గం 05 ని వరకు
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10గం॥ 00 ని॥ నుంచి 10 గం॥ 48 ని॥ వరకు)పునః ప.2-48ని నుండి 3-36ని వరకు
రాహుకాలం : (ఈరోజు పగలు 1 గం॥ 30 ని॥ నుంచి 3 గం॥ 00 ని॥ వరకు)
☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు
🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 04 ని॥ వరకు
మేషం (Mesham)
ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు.ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.
వృషభం (Vrushabam)
ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువుని ఆరాధించాలి.
మిథునం (Mithunam)
ఈ రాశివారికి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కర్కాటకం (Karkatakam)
ఈ రాశివారికి అనుకూలమైన రోజు . ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
సింహం (simham)
ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కన్య (Kanya)
ఈ రాశివారు అప్రమత్తతతో ఉండటం అవసరం. బంధు,మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకున్నాతీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.
తుల (Thula)
ఈ రాశివారికి ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులు మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Vruchikam)
ఈ రాశివారు మనోబలంతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.
ధనుస్సు (Dhanushu)
ఈ రాశివారు ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. దైవబలంతో కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి.చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.
మకరం (Makaram)
ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు.బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.
కుంభం (Kumbam)
ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మీనం (Meenam)
ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధకలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.