ఈ రాశివారికి ఆర్ధిక అంశాలు కలిసివస్తాయి.

తేది : 9, సెప్టెంబర్ 2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : భాద్రపద మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : సోమవారం

పక్షం : శుక్ల పక్షము

తిథి : షష్ఠి

(ఈరోజు సాయంత్రం 4 గం 39 ని వరకు)

⭐నక్షత్రం : విశాఖ

( ఈరోజు పగలు 2 గం 29 ని వరకు )

వర్జ్యం :

ఈరోజు రాత్రి 6 గం 45 ని నుండి 8 గం 27 ని వరకు

అమ్రుతఘడియలు : ఉదయం 6గం 56ని వరకు పునః రాత్రి తెల్లవారుజామున 5 గం 16 ని నుండి లగాయతు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12గం॥ 24 ని॥ నుంచి1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు పగలు 2 గం॥ 48 ని॥ నుంచి 3 గం॥ 36 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి 9 గం॥ 00 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 49 ని॥ లకు.

🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 09 ని॥ లకు.

మేషం(Mesham):

ఈ రాశివారికి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో అంచనాలు తప్పుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ఆకుపచ్చ, తెలుపురంగులు ధరించండి అంతా మంచే జరుగుతుంది. శివాలయ సందర్శనం ఉత్తమం.

వృషభం(Vrushabam):

ఈ రాశివారికి ఆర్ధిక అంశాలు కలిసివస్తాయి. యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు లక్ష్యసాధన దిశగా సాగుతారు.. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అంచనాలు తారుమారు. తెలుపు, చాక్లెట్‌రంగులు శుభాన్ని ఇస్తాయి. మహాలక్ష్మిని ఆరాధించండి.

మిథునం(Mithunam):

ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో వివాదాలు సర్దుకుంటాయి.. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు.వారం చివరిలో బంధువుల ద్వారా విమర్శలు. ప్రయాణాలలో అవాంతరాలు. ఖర్చులు అధికం. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు మంచివి. వినాయకుడిని పూజించండి.

కర్కాటకం(Karkatakam):

ఈ రాశివారు పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. క్రీడాకారులు, రాజకీయవేత్తలకుు కొత్త అవకాశాలు రావచ్చు. వారం చివరిలో కొంత నిరాశకు లోనవుతారు. ఆర్థికంగా ఇబ్బందులు. మిత్రులతో వివాదాలు.. లేత ఎరుపు, చాక్లెట్‌రంగులు ధరించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

సింహం(Simham):

ఈ రాశివారు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కళాకారులకు చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్నేహితుల ద్వారా ఒత్తిడులు. మానసిక ఆందోళన. పసుపు, నేరేడు రంగులు శుభం. శివాలయ సందర్శనం మంచిది.

కన్య(Kanya):

ఈ రాశివారికి అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు శుభాన్ని ఇస్తాయి. విష్ణుసహస్రనామాలు పఠించండి.

తుల(Thula):

ఈ రాశివారికి శ్రమకు తగిన ఆర్ధిక ఫలితాలు ఉంటాయి. . వ్యయప్రయాసలు ఎక్కువ. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు శ్రేయస్కరం. అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam):

ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు చేకూరుతాయి. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. వివాదాలకు దూరంగా ఉండండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల సేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయవర్గాలకు సన్మానయోగం.వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ధనవ్యయం. గులాబీ, చాక్లెట్‌ రంగులు మంచివి. సూర్యారాధన మంచిది.

ధనుస్సు(Dhanussu):

ఈ రాశివారికి శుభప్రదమైన కాలం ఇది. మీ నిర్ణయాలు సంపూర్ణ విజయం సాధిస్తాయి. ఆర్ధికంగా బలపడటానికి ఈ సమయం ఎంతో సహకరిస్తుంది. ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్నరీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఆత్మవిశ్వాసంతో పని చేయడంతో ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. ఎరుపు, లేత పసుపు రంగులు శ్రేయస్కరం. దేవీస్తుతి మంచిది.

మకరం(Makaram):

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అధికారుల అండదండలు మీకు ఉంటాయి. అయితే చేపట్టిన పనులు మాత్రం నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. ఎరుపు, పసుపు రంగులు. గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కుంభం(Kumbham):

ఈ రాశివారికి వ్యాపారంలో కలిసివస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎప్పట్నుంచో ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. సహనాన్ని వీడకండి. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

మీనం(Meena):

ఈ రాశివారికి శుభకాలం నడుస్తున్నది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగులు పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. వారాంతంలో శుభవార్త వింటారు. ధనవ్యయం. నీలం, చాక్లెట్‌ రంగులు, మహాలక్ష్మిని పూజించండి.

Eha Tv

Eha Tv

Next Story