Today Rasi Phalalu : ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...!
ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...!
తేది 21 ఆగష్టు -2024
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
మాసం : శ్రావణ మాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణ పక్షము
తిథి : విదియ
(ఈరోజు రాత్రి 8గం 10 ని వరకు
నక్షత్రం : శతభిషం
ఈరోజు ఉదయం 6గం 18 ని వరకు
తదుపరి...
పూర్వాభాద్ర రాత్రి తెల్లవారుజామున 4గం 48ని వరకు
వర్జ్యం :- పగలు 12గం 18 ని నుండి 1 గం 48 ని వరకు
అమ్రుతఘడియలు:- ఈరోజు రాత్రి 9 గం 27 ని నుండి 10 గం 56 ని వరకు
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి 12 గం॥ 24 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు పగలు 12 గం॥ 00 ని॥ నుంచి 1 గం॥ 30 ని॥ వరకు)
☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 47 ని॥ లకు.
🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6గం॥ 20 ని॥ లకు.
మేషం(Mesham)
ఈ రాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆత్మీయుల సాయం అందుకుని లాభపడతారు. చేపట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మనస్పర్థలతో దూరమైన వారు దగ్గరవుతారు. ముఖ్యమైన కోనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించండి.
వృషభం(Vrushabham)
ఈ రాశివారికి కూడా అనుకూలమైన రోజే! మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దుర్గాదేవిని ఆరాధించండి.
మిథునం(Mithunam)
ఈ రాశివారికి శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదిత్య శ్లోకాలు పఠించండి.
కర్కాటకం(Karkatakam)
ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి పనులు చేస్తారు. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకుండా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు తీసుకోండి. శ్రీ మహావిష్ణువును పూజించండి.
సింహం(Simham)
ఈ రాశివారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు. చేపట్టే పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కీలకమైన విషయాలలో బంధు మిత్రుల సలహాలు తీసుకోండి. శివారాధన మేలు చేస్తుంది.
కన్య(Kanya)
ఈ రాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. అలాగని డీలా పడాల్సిన పని లేదు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం ఉత్తమం. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని పూజించండి.
తుల(Thula)
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆపదలు రాకుండా జాగ్రత్త పడండి. విష్ణుసహస్ర నామాలు పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం(Vruchikam)
ఈ రాశివారికి మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహాలను పూజించండి.
ధనుస్సు
ఈ రాశివారు కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆంజనేయస్వామిని ఆరాధించండి.
మకరం(Makaram)
ఈ రాశివారు ఈ రోజు అంతా అనుకూలంగానే ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. శివాలయాన్ని సందర్శించండి.
కుంభం(Kumbam)
ఈ రాశివారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిథి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మీనం(Meenam)
ఈ రాశివారు ఈ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.