Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు.... 12 రాశుల ఫలితాలు ఇలా 21/12/2024
ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది!
తేదీ:- 21, డిసెంబరు 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయనం
ఋతువు:- హేమంత
మాసం:- మార్గశీర్షం
పక్షం:- బహుళ పక్షం
తిథి:- షష్ఠి మ.1.40 వరకు
వారం:- శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:- పుబ్బ పూర్తి
యోగం:- ప్రీతి రా.8.38 వరకు
కరణం:- వణిజ మ.1.40 వరకు తదుపరి విష్ఠి రా.2.26 వరకు
వర్జ్యం:- మ 2.28 - 4.12 వరకు
దుర్ముహూర్తము:- ఉ.6.28 - 7.56 వరకు
అమృతకాలం:- రా.12.47 - 2.30 వరకు
రాహుకాలం:- ఉ.9.00 - 10.30 వరకు
యమగండ/కేతుకాలం:- మ.1.30 - 3.00 వరకు
సూర్యరాశి:- ధనుస్సు
చంద్రరాశి:- సింహం
సూర్యోదయం:- 6.28
సూర్యాస్తమయం:- 5.26
మేషం
ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.
వృషభం
ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.
మిథునం
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. భగవన్నామ స్మరణ మరవకండి.
కర్కాటకం
ఈ రాశి వారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నవగ్రహ ప్రదక్షణ చేయండి.
సింహం
ఈ రాశి వారికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అమ్మవారిని ఆరాధించండి.
కన్య
ఈ రాశి వారికి సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. కుల దైవాన్ని ప్రార్ధించండి.
తుల
ఈ రాశి వారికి ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి.
వృశ్చికం
ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని కొలవండి.
ధనుస్సు
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.
మకరం
ఈ రాశి వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. మహాలక్ష్మిని పూజించండి.
కుంభం
ఈ రాశి వారికి ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శివారాధన చేయండి.
మీనం
ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మహా విష్ణువును పూజించండి.