Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు.... 12 రాశుల ఫలితాలు ఇలా 20/12/2024
ఈ రాశి వారికి రుణ బాధలు తొలగిపోతాయి!
20.12.2024 శుక్రవారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం - బహుళ పక్షం
తిథి:పంచమి మ12.34 వరకు
వారం:భృగువాసరే (శుక్రవారం)
నక్షత్రం:మఖ తె5.51 వరకు
యోగం:విష్కంభం రా8.53 వరకు
కరణం:తైతుల మ12.34 వరకు తదుపరి గరజి రా1.06 వరకు
వర్జ్యం:సా5.08 - 6.49
దుర్ముహూర్తము:ఉ8.39 - 9.23
మరల మ12.18 - 1.02
అమృతకాలం:తె3.18 - 5.00
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం:5.26
మేషం
ఈ రాశి వారి కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దుర్గా దేవి స్తోత్రం చదవండి.
వృషభం
ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నంసులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.
మిథునం
ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. మహాలక్ష్మిని పూజించండి.
కర్కాటకం
ఈ రాశి వారు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. కుల దైవాన్ని ప్రార్ధించండి.
సింహం
ఈ రాశి వారు ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. సుబ్రమణ్య స్వామి దేవాలయం సందర్శించండి.
కన్య
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన మంచిది.
తుల
ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.
వృశ్చికం
ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి. నవగ్రహ ప్రదక్షణ చేయండి.
ధనుస్సు
ఈ రాశి వారు నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.
మకరం
ఈ రాశి వారికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా చదవండి.
కుంభం
ఈ రాశి వారికి గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహా విష్ణువును పూజించండి.
మీనం
ఈ రాశి వారు కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రామాలయ సందర్శన చేయండి.