ఈ రాశి వారికి అనుకోకుండా లాభం!

తేదీ:- 19, డిసెంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయనం

ఋతువు:- హేమంత

మాసం:- మార్గశీర్షం

పక్షం:- బహుళ పక్షం

తిథి:- చవితి మ.12 08 వరకు

వారం:- గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:- ఆశ్లేష తె.4.25 వరకు

యోగం:- వైధృతి రా.9.24 వరకు

కరణం:- బాలువ మ.12.08 వరకు తదుపరి కౌలువ రా.12.46 వరకు

వర్జ్యం:- సా.4.46 - 6.26

దుర్ముహూర్తము:- ఉ.10.07 - 10.51 వరకు మరల మ.2.30 - 3.14

అమృతకాలం:- రా.2.45 - 4.25 వరకు

రాహుకాలం:- మ.1.30 - 3.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.6.00 - 7.30 వరకు

సూర్యరాశి:- ధనుస్సు

చంద్రరాశి:- కర్కాటకం

సూర్యోదయం:- 6.28

సూర్యాస్తమయం:- 5.26



మేషం

ఈ రాశి వారికి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మవారిని ఆరాధించండి.


వృషభం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మహా విష్ణువును పూజించండి.


మిథునం

ఈ రాశి వారికి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.


కర్కాటకం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


సింహం

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి.


కన్య

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. మహాలక్ష్మి పూజ చేయండి.


తుల

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. కుల దైవాన్ని ప్రార్ధించండి.


వృశ్చికం

ఈ రాశి వారికి ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణము చేయండి.


ధనుస్సు

ఈ రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.


మకరం

ఈ రాశి వారికి చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. శివారాధన చేయండి.


కుంభం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.


మీనం

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.

ehatv

ehatv

Next Story