ఈ రోజు ఏ రాశివారికి(Rasi phalalu) ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం!

ఈ రోజు ఏ రాశివారికి(Rasi phalalu) ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం!

మేషం(Mesham)

ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వగృహ స్వప్నం నేరవేరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఓ శుభవార్త వింటారు. సూర్యారాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మొదలు పెట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. ఓ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో మీ పేరు మారుమోగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయ సందర్శన ఉంటుంది. దైవ ప్రార్థన చేయండి.

మిథునం(mithunam)

ఈ రాశివారు బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తారు. మొదలుపెట్టిన పనులు అనుకున్నదాని కంటే త్వరితగతిన పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. శివుడిని ప్రార్థించాలి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏ కార్యక్రమాన్ని అయినా మొదలు పెట్టే ముందు బాగా ఆలోచించడం మంచిది. పెద్దల సలహాలు తీసుకోవాలి. అధికారులతో తిట్లు తినే ఛాన్సు ఉంది. గొడవలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

సింహం(simha)

ఈ రాశివారికి ఈ రోజు చాలా బాగుంది. జన్మస్థ చంద్ర బలం అనుకూలంగా ఉంది. సుఖ శాంతులు కలుగుతాయి. అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలను కలుసుకుంటారు. బంధు మిత్రుల అండదండలు లభిస్తాయి. పరమేశ్వరుడిని పూజించడం శ్రేయస్కరం.

కన్య(Kanya)

ఈ రాశి వారికి ఈ రోజు అంతగా అనుకూలంగా లేదు. ద్వాదశ చంద్ర బలం అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిరుత్సాహాన్ని కొని తెచ్చుకోకండి. ఒత్తిడిని అధిగమించండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అమ్మవారిని ప్రార్థించండి.

తుల(Thula rasi)

ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పనులకు అవరోధాలు ఎదురుకాకుండా చూసుకోండి. ధనలాభం కనిపిస్తోంది. లక్ష్మీదేవిని పూజించాలి. ఆలయ సందర్శన అవసరం.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి కలిసివచ్చే రోజు ఇది. ఏ పని మొదలు పెట్టినా శ్రమ లేకుండా ఇట్టే పూర్తవుతుంది. దశమస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది కాబట్టి అంతా మంచే జరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సూర్యుడిని ఆరాధించండి.

ధనుస్సు(Dhannus)

ఈ రాశివారికి జాగురూకతతో మెలగాలి. అవసరానికి సాయం అందుతుంది. ఏమీ కాదన్న ధీమాతో ఉంటారు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. వారి ఎత్తుగడలను ముందే పసికట్టండి. హనుమాన్‌ చాలీసాను పఠించండి.

మకరం(Makaram)

ఈ రాశివారు ఆర్ధికంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. బంధువులతో సఖ్యత అవసరం. ఇష్టదైవాన్ని తల్చుకోండి.

కుంభం(Kumbam)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో జాప్యం కలుగుతుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించండి.

మీనం(Meenam)

ఈ రాశివారు అనుకున్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని దేవుడికి పూజలు చేయండి.

Eha Tv

Eha Tv

Next Story