తేదీ:- 31, జనవరి 2025

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- ఉత్తరాయనం

ఋతువు:- శిశిర

మాసం:- మాఘ మాసం

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- విదియ సా.4.18 వరకు

వారం:- శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:- ధనిష్ఠ ఉ.8.09 వరకు

యోగం:- వరీయాన్ సా.6.11 వరకు

కరణం:- కౌలువ సా.4.18 వరకు తదుపరి తైతుల తె.3.24 వరకు

వర్జ్యం:- మ.3.02 - 4.34 వరకు

దుర్ముహూర్తము:- ఉ.8.51 - 9.36 మరల మ.12.35 - 1.20 వరకు

అమృతకాలం:- రా.12.14 - 1.46 వరకు

రాహుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు

యమగండ/కేతుకాలం:- మ.3.00 - 4.30 వరకు

సూర్యరాశి:- మకరం

చంద్రరాశి:- కుంభం

సూర్యోదయం:- 6.38 సూర్యాస్తమయం:- 5.50



మేషం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకువెళ్తారు. మహా లక్ష్మిని ఆరాధించండి.



వృషభం

ఈ రాశి వారు వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. దైవారాధన మరువకండి.


మిథునం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.


కర్కాటకం

ఈ రాశి వారు శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రతయ్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుల దైవాన్ని ప్రార్ధించండి.


సింహం

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతనకార్యాలు వాయిదావేసుకోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షణ చేయండి.


కన్య

ఈ రాశి వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.




తుల

ఈ రాశి వారు ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. అమ్మవారిని ఆరాధించండి.


వృశ్చికం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.


ధనుస్సు

ఈ రాశి వారికి నూతన వ్యక్తులు పరిచయమవుతారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.


మకరం

ఈ రాశి వారికి కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. శివారాధన చేయండి.


కుంభం

ఈ రాశి వారు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.


మీనం

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. హనుమాన్ చాలీసా చదవండి.

ehatv

ehatv

Next Story