ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

తేదీ:- 27, జనవరి 2025

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- ఉత్తరాయనం

ఋతువు:- హేమంత

మాసం:- పుష్య మాసం

పక్షం:- బహుళ పక్షం

తిథి:- త్రయోదశి రా.7.39 వరకు

వారం:- సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:- మూల ఉ.8.20 వరకు

యోగం:- హర్షణం రా.2.00 వరకు

కరణం:- గరజి ఉ.7.28 వరకు తదుపరి వణిజ రా.7.39 వరకు

వర్జ్యం:- ఉ.6.39 - 8.20 వరకు మరల సా.6.11 - 7.49 వరకు

దుర్ముహూర్తము:- మ.12.35 - 1.20 వరకు మరల 2.50 - 3.34 వరకు

అమృతకాలం:- తె.4.02 - 5.40

రాహుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు

సూర్యరాశి:- మకరం

చంద్రరాశి:- ధనుస్సు

సూర్యోదయం:- 6.38 సూర్యాస్తమయం:- 5.49


మేషం

ఈ రాశి వారు వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి.



వృషభం

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. శివారాధన శ్రేయస్కరం.


మిథునం

వ్యవసాయరంగంలోని ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.


కర్కాటకం

ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. దైవారాధన మరువకండి.


సింహం

ఈ రాశి వారు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నవగ్రహ స్తోత్రం పఠించండి.


కన్య

ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహా విష్ణువును పూజించండి.



తుల

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది. శ్రీ మహా లక్ష్మిని ఆరాధించండి.


వృశ్చికం

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. కుల దైవాన్ని ప్రార్ధించండి.


ధనుస్సు

ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణము చేయండి.


మకరం

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.


కుంభం

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. దుర్గా దేవి స్తోత్రం చదవండి.


మీనం

ఈ రాశి వారికి అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభిచకూడదు. అమ్మ వారిని ఆరాధించండి.

ehatv

ehatv

Next Story