బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

తేదీ:- 26, జనవరి 2025

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- ఉత్తరాయనం

ఋతువు:- హేమంత

మాసం:- పుష్య మాసం

పక్షం:- బహుళ పక్షం

తిథి:- ద్వాదశి రా.7.17 వరకు

వారం:- ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:- జ్యేష్ఠ ఉ.7.11 వరకు

యోగం:- వ్యాఘాతం తె.3.03 వరకు

కరణం:- కౌలువ ఉ.6.51 వరకు తదుపరి తైతుల రా.7.17 వరకు

వర్జ్యం:- మ.3.33 - 5.14 వరకు మరల తె.6.39 నుండి

దుర్ముహూర్తము:- సా.4.18 - 5.03 వరకు

అమృతకాలం:- రా.1.37 - 3.18 వరకు

రాహుకాలం:- సా.4.30 - 6.00 వరకు

యమగండ/కేతుకాలం:- మ.12.00 - 1.30 వరకు

సూర్యరాశి:- మకరం

చంద్రరాశి:- వృశ్చికం

సూర్యోదయం:- 6.38 సూర్యాస్తమయం:- 5.48


మేషం

బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.




వృషభం

తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.


మిథునం

రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.


కర్కాటకం

కుటుంబ కలహాలు దూరమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.


సింహం

నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.


కన్య

ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.




తుల

ప్రయత్నం మేరకు స్వల్పలాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారరంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.


వృశ్చికం

తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.


ధనుస్సు

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.


మకరం

విందులు, వినోదాలకు దూరంగా ఉండట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.


కుంభం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. సహనంవహించడం అన్నివిధాలా మేలు.


మీనం

కుటుంబంలో చిన్నిచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు

చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

ehatv

ehatv

Next Story