బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

శుభమస్తు పంచాంగం

అశ్విని కార్తీ ప్రారంభం

తేది : 13, ఏప్రిల్ 2025

సంవత్సరం :శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఆయనం :ఉత్తరాయణం

మాసం : చైత్ర మాసం

ఋతువు :వసంత ఋతువు

కాలము : వేసవి కాలం

వారము :ఆదివారం

పక్షం : బహుళ పక్షం

తిథి : పాడ్యమి*పూర్తి

( ఈరోజు తెల్లవారుజామున 4 గం " 23 ని " నుంచి )

నక్షత్రం : చిత్త

( ఈరోజు సాయంత్రం 5 గం॥ 13 ని " నుంచి ఈరోజు రాత్రి 6 గం " 44 ని " వరకు )

వర్జ్యం : ( ఈరోజు రాత్రి 1 గం " 58 ని " నుంచి రాత్రి తెల్లవారుజామున 3 గం " 42 ని " వరకు )

దుర్ముహూర్తం:(ఈరోజు సాయంత్రం 4 గం॥ 36 ని " నుంచి సాయంత్రం 5 గం " 26 ని " వరకు )

రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)

గుళికకాలం: (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)

యమగండం: ( ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)

సూర్యోదయం: ఉదయం 5 గం॥ 49 ని॥ లకు

సూర్యాస్తమయం: సాయంత్రం 6 గం॥ 16 ని॥ లకు

మేషం

బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం

బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మిధునం

ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు, మిత్రులతో మాటపట్టింపులు. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం

నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనస్సు

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం

అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ధన వ్యవహారాలు కలసి వస్తాయి.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

ehatv

ehatv

Next Story