శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శ్రావణ మాసం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శ్రావణ మాసం, తిథి: చవితి పూర్తి , నక్షత్రం: ఉత్తర ప.11.34 వరకు, తదుపరి హస్త , వర్జ్యం: ఉదయం 9.04 నుంచి 10.53 వరకు; రాహుకాలం ప.01.30 నుంచి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.58, సూర్యాస్తమయం: 6.47.

మేషం(Mesham):

ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం(Vrushabam):

ఈ రాశి వారికి మిత్రుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మిథునం(Mithunam):

ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, శుభాకాంక్షలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ కొలిక్కి వస్తుంది..

కర్కాటకం(Karkatakam):

ఈ రాశివారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

సింహం(Simham):

ఈ రాశివారికి ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత రుణాలు వసూలవుతాయి. వాహనయోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

కన్య(Kanya):

ఈ రాశివారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యజయం. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు.

తుల(Thula):

ఈ రాశి వారు పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు.

వృశ్చికం(Vruchikam):

ఈ రాశివారికి ఈ రోజు ధనవ్యయం ఉంటుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

ధనుస్సు(Dhannus):

ఈ రాశివారికి ఈ రోజు పనుల్లో విజయం చేకూరుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మకరం(Makaram):

ఈ రాశివారికి వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు

కుంభం(Kumbam):

ఈ రాశివారు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది.

మీనం(Meenam):

ఈ రాశివారికి ఇవాళ ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూల సమాచారం.

Updated On 8 Aug 2024 1:31 AM GMT
Eha Tv

Eha Tv

Next Story