Today Rashi Phalalu - Daily horoscope : ఈ రాశి వారికి విదేశీయాన ప్రయత్నం సులభం!
కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు.

తేదీ:- 28, ఫిబ్రవరి 2025
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- ఉత్తరాయనం
ఋతువు:- శిశిర
మాసం:- మాఘ మాసం
పక్షం:- బహుళ పక్షం
తిథి:- అమావాస్య ఉ.7.06 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తె.5.30 వరకు
వారం:- శుక్రవారం
(భృగువాసరే)
నక్షత్రం:- శతభిషం మ.3.05 వరకు
యోగం:- సిద్ధం రా.10.00 వరకు
కరణం:- నాగవం ఉ.7.06 వరకు తదుపరి కింస్తుఘ్నం సా.6.17 వరకు ఆ తదుపరి బవ తె.5.30 వరకు
వర్జ్యం:- రా.9.13 - 10.45 వరకు
దుర్ముహూర్తము:- ఉ.8.43 - 9.29 వరకు మరల మ12.35 - 1.22 వరకు
అమృతకాలం:- ఉ.8.11 - 9.43 వరకు
రాహుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు
యమగండ/కేతుకాలం:- మ.3.00 -4.30 వరకు
సూర్యరాశి:- కుంభం
చంద్రరాశి:- కుంభం
సూర్యోదయం:- 6.24
సూర్యాస్తమయం:- 6.01
మేషం
కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
వృషభం
విదేశయాన ప్రయత్నంసులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం
వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
కర్కాటకం
నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు.
సింహం
ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య
ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చికం
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది.
మకరం
కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మీనం
కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
