దేవతల గురువు బృహస్పతి ని గురు గ్రహంగా పరిగణిస్తారు . గురువు ఉన్నత స్థానంలో ఉంటే కలిగే ఫలితాలు అత్యద్భుతం.. అలాగే నీచ స్థానంలో ఉన్నప్పుడు దుఃఖం,ప్రశాంతతని కోల్పోవడం ,ఆస్తి నష్టం ,అనారోగ్యం వంటి.. అశుభాలు ఏర్పడతాయి.. అదే గురుడు మంచి స్థానంలో ఉంటే వారికి దైవ కటాక్షం తో పాటు అన్ని పనులలో విజయం లభిస్తుంది మానసిక ప్రశాంతతను పొందుతారు.. లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. గౌరవం పెరుగుతుంది.. జన్మలగ్నం నుండి నాలుగు, ఏడు, పది స్థానాలలో […]

దేవతల గురువు బృహస్పతి ని గురు గ్రహంగా పరిగణిస్తారు . గురువు ఉన్నత స్థానంలో ఉంటే కలిగే ఫలితాలు అత్యద్భుతం.. అలాగే నీచ స్థానంలో ఉన్నప్పుడు దుఃఖం,ప్రశాంతతని కోల్పోవడం ,ఆస్తి నష్టం ,అనారోగ్యం వంటి.. అశుభాలు ఏర్పడతాయి.. అదే గురుడు మంచి స్థానంలో ఉంటే వారికి దైవ కటాక్షం తో పాటు అన్ని పనులలో విజయం లభిస్తుంది మానసిక ప్రశాంతతను పొందుతారు.. లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. గౌరవం పెరుగుతుంది.. జన్మలగ్నం నుండి నాలుగు, ఏడు, పది స్థానాలలో గురువు కనక జాతకంలో ఉంటే వారికి సంపద పెరుగుతుంది ధనలక్ష్మి ఇంటిలో తాండవం చేస్తుంది.. గురుబలం లేకపోతే వారు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.. అలాంటి గురుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి అఖండ లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది.. మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు కొన్ని రాశుల వారికి.

వచ్చే ఏప్రిల్ మాసంలో బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు.. పదేళ్ల తర్వాత రాబోతున్న ఈ అద్భుతం వలన కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి.. దీనిని అఖండ లక్ష్మీ యోగంగా పరిగణిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు..

మకర రాశి: గురుడు మేష రాశిలోకి సంచరించడం అనేది మకర రాశి వారికి విశేషం లాభం కలిగి కాలం ఈ సమయంలో వీరు అష్టైశ్వర్యాలను పొందుతారు.. విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు.. ఆస్తులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి కాలం.. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి..

మీన రాశి.. ఈ రాశి వారికి అఖండ లక్ష్మీ యోగం వలన ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు.. వీరికి విశేష ధన లాభం కలుగుతుంది.. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.. ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నా వారికి మీరు మంచి మిత్రులుగా మారబోతున్నారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం..

మిధున రాశి.. ఈ రాశి జాతకులకు ఆదాయ గృహంలో గురుడు సంచరిస్తాడు.. కాబట్టి డబ్బు విషయంలో వీరికి ఎలాంటి లోటు ఉండదు.. ఊహించని లక్ష్మీ యోగం వీర సొంతం.. మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం పొందుతారు.. ఉద్యోగంలో ప్రమోషన్స్, జీతాలు పెరగడం వంటి లాభాలు ఉంటాయి.. వ్యాపారంలో ఒప్పందాలు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలు కాబోతున్నాయి..

గమనిక :జ్యోతిష్య నిపుణుల సలహాలు సూచనలు పంచాంగాల ఆధారంగా ఇంటర్నెట్ నుండి సేకరించబడ్డ సమాచారం మాత్రమే ఇక్కడ అందించించడం జరిగింది. వ్యక్తిగత జాతక ఫలితాల ఆధారంగా కాదు . దయచేసి గమనించగలరు .

Updated On 26 Feb 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story