మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) మొండిబాకీలను వసూలు అవుతాయి . ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొంఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు […]

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

మొండిబాకీలను వసూలు అవుతాయి . ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు
ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో
జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థికపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులకు మేలు జరిగే
పనులు చేస్తారు. కొంఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం
లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు
అందిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో
కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు
సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.
విద్యార్థులుకు శ్రమ కాలం. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా
ముందుకు వెళతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు వల్ల కొన్ని మంచి ప్రయోజ నాలు అనుభవానికి వస్తాయి.
కొందరిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు
చేయవలసి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో
ఆటంకం . అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు
బాగుంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితులుచాలావరకు చక్కబడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు
ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలోని వారికి
అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం
పర్వాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి.
ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి
చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల
ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూర
ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
. వాహన యోగం ఉంది.
వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక
పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం విషయంలో మంచిప్రయోజనం పొందుతారు . ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచన . ఆహార విహారాల్లో కొన్ని
జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని
చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది
కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు . ఆర్థిక పరిస్థితి
అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు
మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం పరిస్థితి బాగానే ఉంటుంది. అధికారుల
అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు
పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ప్రేమ
వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు
తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
. పడుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి.సమాజం లో గౌరవ మర్యాదలు
పెరుగుతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహచరుల
నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ఆరోగ్య పరిస్థితి నిలకడగా
ఉంటుంది. పిల్లలు చదువులలో
బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు
స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక
శ్రమకు గురవుతారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కొందరు బంధువులు అపార్థం
చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది.

Updated On 17 March 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story