మేష రాశి : ఉద్యోగంలో సమస్యలు తొలిగిపోతాయి . కొన్ని విషయాల్లో కోపం పనికి రాదు . ప్రియమైన వారితో గొడవలు పెరిగే అవకాశం ఉంది . ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అసలు చేయకండి . వృషభ రాశి :విసుగు ,చికాకులనుండి బయట పడే మార్గాన్ని తెలుసుకుంటారు . ఆలస్యమైన పనులను పూర్తి చేస్తారు . సమస్యలు ఎక్కడ నుండి మొదలవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది . కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు . మిథున రాశి […]

మేష రాశి : ఉద్యోగంలో సమస్యలు తొలిగిపోతాయి . కొన్ని విషయాల్లో కోపం పనికి రాదు . ప్రియమైన వారితో గొడవలు పెరిగే అవకాశం ఉంది . ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అసలు చేయకండి .

వృషభ రాశి :విసుగు ,చికాకులనుండి బయట పడే మార్గాన్ని తెలుసుకుంటారు . ఆలస్యమైన పనులను పూర్తి చేస్తారు . సమస్యలు ఎక్కడ నుండి మొదలవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది . కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు .

మిథున రాశి : ప్రసంశలు అందుకుంటారు .మీ ప్రతిభతో ఆకట్టుకుంటారు . మీ శత్రువులు ఎవరో తెలుసుకుంటారు . కొత్తవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి .

కర్కాటక రాశి:అటు పని చేసే చోటు ఇటు ఇంట్లో పనులను సమన్వయంతో పూర్తి చేస్తారు . ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమిస్తారు . మీకు సంబందించిన ఎలాంటి రహస్యాలను ఎవరితో పంచుకోవద్దు .అలాచేస్తే నష్టపోతారు .

సింహ రాశి :ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . ఎదుటివారికి సలహాలు ఇవ్వటంలో జాగ్రత్త వహించండి . ఇతరుల విషయాల్లో జోక్యం అనవసరం . పెండింగ్ పనులను పూర్తిచేస్తారు .

కన్య రాశి:ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది . అనుకున్న పనులు పూర్తి చేస్తారు . ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి . మీ తెలివి తేటలతో పనులు పూర్తి చేస్తారు .

తులా రాశి : మీరు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి . పై అధికారులనుండి ప్రసంశలు అందుకుంటారు . మీ సొంత తెలివితో అలోచించి చేసే ఏ పని అయిన లభిస్తుంది .

వృశ్చిక రాశి: సమస్యలను పెంచుకోవద్దు . అనవసరమైన చికాకులు ఇబ్బంది పెడతాయి. ఇల్లు మారే సూచన ఉంది . బంధువులు ,సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు .

ధనుస్సు రాశి :భాద్యతలు పెరుగుతాయి . కంప్లైంట్ చేయటం ద్వారా సమస్యలు కొని తెచ్చుకుంటారు . ఎంత త్వరగా మీరు పనులు పూర్తి చేస్తే అంత మంచిది . ప్రయత్న లోపం లేకుండా కష్టపడండి .

మకర రాశి:శ్రమతో కూడిన పని వలన మంచి ఫలితాన్ని చూస్తారు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది . ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది . పనిలో ప్రసంశలు ,ఇంక్రిమెంట్లు అందుకుంటారు . ఈ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది .

కుంభ రాశి :జీవిత భాగస్వామితో విభేదాలు . ఆర్థికంగా బాగుంటుంది . ఆరోగ్యం నిలకడగా ఉంటుంది . స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు .

మీన రాశి :దగ్గర వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు . విందులు ,వినోదాల్లో పాల్గొంటారు . శుభకార్యాలకు వెళతారు . రోజంతా సంతోషంగా గడుపుతారు .

Updated On 28 April 2023 6:37 AM GMT
rj sanju

rj sanju

Next Story