Rasi Phalalu : నేటి రాశి ఫలాలు,శుభకాలమా? సవాళ్ల సమయమా? తెలుసుకోండి!
ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం.

గురువారం,మార్చి 27, 2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం - బహుళ పక్షం
తిథి : త్రయోదశి రా9.02 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : శతభిషం రా10.54 వరకు
యోగం : సాధ్యం ఉ7.23 వరకు
తదుపరి శుభం తె4.47 వరకు
కరణం : గరజి ఉ9.49 వరకు
తదుపరి వణిజ రా9.02 వరకు
వర్జ్యం : ఉ6.43 - 8.15
మరల తె4.59 నుండి
దుర్ముహూర్తము : ఉ10.30 - 10.51
మరల మ2.53 - 3.42
అమృతకాలం : మ3.57 - 5.30
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 - 7.30
సూర్యరాశి: మీనం || చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.03 || సూర్యాస్తమయం:
6.07
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడి, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య పరంగా శ్రద్ధ అవసరం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. మాటల చాతుర్యంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
సమాజంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారు లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడులు లాభదాయకం. కుటుంబంతో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
తలచిన కార్యాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు. దైవదర్శనం చేయడం ద్వారా మానసిక శాంతి పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కన్యా (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అనవసర భయాందోళనలకు లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):
శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. విందులు, వినోదాలలో పాల్గొనవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
వృత్తి, ఉద్యోగరంగాలలో అభివృద్ధి ఉంటుంది. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణ, ధనిష్ఠ 1,2):
శుభకార్యాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
ధర్మకార్యాలలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అనుకూల సమయం. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు పొందవచ్చు. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
